Ayodhya-Supreme Judges : రామ్‌లల్లా మహోత్సవానికి ఆ ఐదుగురిలో ఒక్కరే హాజరు.. ఎవరంటే?

అయోధ్య రామ్‌లల్లా 'ప్రాణ్‌ ప్రతిష్ఠ'కి రామమందిర తీర్పునిచ్చిన ఐదుగురు జడ్జిల్లో ఒకరు మాత్రమే ఈవెంట్ కు రానున్నారు. మాజీ సీజేఐలు గొగోయ్‌, బోబ్డే, సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ నజీర్‌ వివిధ కారణాలతో హాజరుకావడం లేదు. ఈ కార్యక్రమానికి జస్టిస్ భూషణ్ హాజరుకానున్నారు.

Ayodhya-Supreme Judges : రామ్‌లల్లా మహోత్సవానికి ఆ ఐదుగురిలో ఒక్కరే హాజరు.. ఎవరంటే?
New Update

Ayodhya Five-Judge Bench Of Supreme Court Only One Likely To Attend For Prana Pratishtha : జనవరి 22న అయోధ్య(Ayodhya) రామాలయంలో రామ్‌లల్లా(Ram Lalla) మహోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తో పాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. గర్భగుడిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ(Prana Pratishtha) కు హాజరుకావాలని రామమందిరంపై చారిత్రక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులకు ఆలయ ట్రస్ట్ ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. రామజన్మభూమి కేసులో చారిత్రాత్మక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు(Supreme Court) రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులను జనవరి 22న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రాష్ట్ర అతిథులుగా ఆహ్వానించారు. ఆహ్వానితుల్లో మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, టాప్‌ లాయర్లతో సహా 50 మందికి పైగా న్యాయనిపుణులు కూడా ఉన్నారు. ఇక రామజన్మభూమి కేసు తీర్పునిచ్చిన ఐదుగురు జడ్జిల్లో ఒకరు మాత్రమే ఈ మహోత్సవానికి వస్తున్నట్టు సమాచారం.

ఆ ఒక్కడే:
150 ఏళ్ల నాటి రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదాన్ని అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్, జస్టిస్‌లు ఎస్‌ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్ 2019లో ఏకగ్రీవ తీర్పునిచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి అనుమతించడం ద్వారా, వారిలో ఒకరు మాత్రమే ఆలయ రాముని ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరవుతారు. ఆలయంలో సోమవారం జరిగే 'ప్రాణ్‌ ప్రతిష్ఠ' కార్యక్రమానికి మాజీ సీజేఐలు గొగోయ్‌, బోబ్డే, సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ నజీర్‌ వివిధ కారణాలతో హాజరుకావడం లేదు. ఈ కార్యక్రమానికి జస్టిస్ భూషణ్ హాజరుకానున్నారు.

లిస్ట్ ఇదే:
ఇక ఆహ్వానితుల్లో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇది కాకుండా అయోధ్య(Ayodhya) కేసు విచారణకు సంబంధించిన న్యాయవాదులు కె.పరాశరన్, హరిశంకర్ జైన్, విష్ణు శంకర్ జైన్, సీఎస్ వైద్యనాథన్, మహేష్ జెఠ్మలానీ, ఎస్‌జి తుషార్ మెహతా, మాజీ ఏజీ కే వేణుగోపాల్, ముకుల్ రోహత్గీలు ఆహ్వానితుల్లో ఉన్నారు. వీరితో పాటు ఆహ్వాన అతిథులుగా జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ జిఎస్ ఖేహర్, జస్టిస్ డికె జైన్, జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రామ సుబ్రమణ్యం, జస్టిస్ కెజి బాలకృష్ణన్, జస్టిస్ అనిల్ దవే, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎం. కె శర్మ, జస్టిస్ ఆదర్శ్ గోయల్, జస్టిస్ విఎన్ ఖరే పేర్లు లిస్ట్‌లో ఉన్నాయి.

Also Read: ఏడంచెల భద్రతా వలయం.. అయోధ్య భద్రత కోసం ఫ్లోటింగ్‌ స్క్వాడ్లు, డ్రోన్లు, ఏఐ..!

WATCH:

#ayodhya #ram-mandir #prana-pratishtha #supreme-judges
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe