Jr.NTR- WAR 2: కేవలం 60 రోజుల్లో ఎన్టీఆర్ 'వార్ 2' షూటింగ్.. హృతిక్ రోషన్ తో కలిసి అన్ని రోజులు మాత్రమే

హృతిక్-ఎన్టీఆర్ కాంబోలో 'వార్ 2' చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. మూవీలో తారక్ కు సంబంధించిన షూట్ కేవలం 60 రోజుల్లో పూర్తిచేయనున్నట్లు సమాచారం. 30 రోజుల్లో సోలో సీన్స్, మరో 30 రోజుల్లో హృతిక్ తో కలిసి ఉన్న సీన్స్ చిత్రీకరించనున్నారు.

Jr.NTR- WAR 2: కేవలం 60 రోజుల్లో  ఎన్టీఆర్  'వార్ 2' షూటింగ్.. హృతిక్ రోషన్ తో కలిసి అన్ని రోజులు మాత్రమే
New Update

Jr.NTR- WAR 2: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కాంబినేషన్ తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ వార్ 2'. యష్ రాజ్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. సిద్దార్థ్ ఆనంద దర్శకత్వంలో వచ్చిన 'వార్' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవగా... ఇక ఇప్పుడు ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో రాబోతున్న 'వార్ 2' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మొదలైన ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Also Read: Vaishnavi Chaitanya: పూట గడవడం కోసం అలా చేశా.. కన్నీళ్లు తెప్పిస్తున్న బేబీ హీరోయిన్ మాటలు

60 రోజుల్లో ఎన్టీఆర్ 'వార్ 2' షూటింగ్

ఈ నేపథ్యంలో సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో ఎన్టీఆర్ కు సంబంధించిన చిత్రీకరణం కేవలం 60 రోజుల్లో పూర్తిచేయనున్నట్లు సమాచారం. 30 రోజుల్లో తన సోలో సీన్స్, మరో 30 రోజుల్లో హృతిక్ కాంబినేషన్ లోని సీన్స్ చిత్రీకరించనున్నారు. ఏప్రిల్ 25 నుంచి ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ షెడ్యూల్ చాలా తక్కువ రోజుల్లోనే పూర్తవనుందని టాక్.

publive-image

సినీ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం సినిమా పూర్తి షూటింగ్ జులై వరకు అయిపోవచ్చని తెలిపారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఆ తర్వాతి 8 నెలలు సమయం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, VFX పై కేటాయిస్తారని సమాచారం. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్ సినిమా పై విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది.

Also Read: Vijay Devarakonda: విజయ్ పెళ్ళిలో రష్మిక డాన్స్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..!

#jr-ntr-war-2-movie #war-2-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe