Job Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఉద్యోగం అనేది ముఖ్యపాత్ర పోషిస్తుంది. కొందరికి ఉద్యోగం చేయకపోతే ఇల్లు కూడా గడవని పరిస్థితి ఉంటుంది. అయితే... ఎంత ఉద్యోగం చేసి సంపాదించినా జీవితం ముందుకు సాగడం కష్టంగా ఉంటుంది. సంపాదించిన డబ్బంతా పట్టణాల్లో ఇంటి అద్దెలు, పెట్రోల్, నిత్యావసరాలకే సరిపోతుంటుంది. మిగులుదల అనేది కనిపించదు. అదీ కాక కరోనా మానవాలిని అతలాకుతలం చేసింది, అందరి ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. ఉద్యోగం చేయడం అనేది కొందరు ఫ్యాషన్‌గా ఫీల్ అవుతారు, కేవలం జల్సాల కోసమే జీతాన్ని ఖర్చు చేస్తుంటారు, అయితే చేసే ఉద్యోగాన్ని కాన్ఫిడెంట్‌గా చేయలేరు. కొన్ని రోజులు ఉద్యోగం చేసి నా వల్ల కాదంటూ వెళ్లిపోతుంటారు. మరికొందరు పొట్టకూటి కోసం తిప్పలు పడుతుంటారు. అయితే ఆఫీసులో సపోర్ట్ లేకపోవడం, కొలీగ్స్ కూడా సహకరించకపోవడం, పని ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోతుంటారు.
ఉద్యోగంలో ఎలా రాణించాలి?
కొత్తగా మీరు ఉద్యోగంలో చేరితే ముందుగా అక్కడి పని విధానం గురించి తెలుసుకోవాలి. ప్రతీ విషయాన్ని అడిగి తెలుసుకుని చేయడం ఉత్తమం. చేసే పనిపై శ్రద్ధ పెట్టాలి, అందరితో మంచిగా మసలుకోవాలి. అలాగే దూర ప్రాంతాల నుంచి ఉద్యోగానికి వెళ్లి రావడంతో ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటారు. అందుకే ఆఫీసుకు అందుబాటులో ఉండేలా ఇల్లు చూసుకోవాలి. కొత్తగా ఉద్యోగానికి వచ్చినవారు ఆఫీసులో ఉన్నంత సేపు ఇంటి గురించి ఆలోచించడం పక్కన పెట్టాలి. ఏదైనా లీవ్‌లు వచ్చినప్పుడు పూర్తిగా కుటుంబంతో గడపాలి. సెలవు ఇచ్చారని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి సమయం వృధా చేసుకోవద్దు.
తోటివారితో ఎలా ఉండాలి?
ఆఫీసులో తోటివారితో మంచిగా ఉంటూ వారికి సహకరిస్తూ మనకు అవసరమైన సహాయం తీసుకోవాలి. టీమ్ లీడర్స్ సలహాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. అనవసరంగా సెలవులు పెడుతూ బాస్ ముందు చులకన కావొద్దు. ఏదైనా తెలియని విషయాలను తెలుసుకుంటూ, ఏ రోజు పనిని ఆరోజే పూర్తి చేస్తూ ఉంటే అందరి దృష్టిలో మంచివారిగా మిగిలిపోతారు. అంతేకాకుండా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా వస్తాయి.
ఇది కూడా చదవండి: పచ్చి బంగాళదుంపల్లో దాగి ఉన్న బ్యూటీ..తెలుసుకుంటే షాకే!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.