AP: ఏపీ శిశు సంక్షేమ శాఖలో జాబ్స్.. ఈ రెండు అర్హతలుంటే చాలు

నెల్లూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం కాంట్రక్ట్ విధానం ప్రతిపాదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనుండగా డిగ్రీ, పీజీతోపాటు సంబంధిత శాఖలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. అప్లికేషన్ కు డిసెంబర్ 23 లాస్ట్ డేట్.

New Update
AP: ఏపీ శిశు సంక్షేమ శాఖలో జాబ్స్.. ఈ రెండు అర్హతలుంటే చాలు

AP Child Welfare Department Jobs : ఏపీ ప్రభుత్వం(AP Government) తమ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు వరుస తీపి కబుర్లు అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు కాంట్రాక్ట్ విధానంలోనూ చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. వ్యవసాయ, వైద్య, విద్య రంగాల్లోనూ పలు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నెల్లూరులోని జిల్లా మహిళా శిశు సంక్షేమ(AP Child Welfare Department Jobs), సాధికారత అధికారి కార్యాలయంలో కాంట్రక్ట్ విధానం ప్రతిపాదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరింది. ఆసక్తిగల అభ్యర్థులు కింద సూచించిన విధంగా అప్లై చేసుకోవాలి.

1. జిల్లా కోఆర్డినేటర్ : 01
2. ప్రాజెక్ట్ అసిస్టెంట్ : 01
3. బ్లాక్ కోఆర్డినేటర్ : 10

Also read : AP JOBS : ఏపీ వైద్యారోగ్య శాఖలో 76 ఉద్యోగాలు.. టెన్త్ ఉంటే చాలు

అర్హతలు :
మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనుండగా పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు వయసు 42ఏళ్లకు మించకూడదు. ఈ ఉద్యోగాలకోసం ఆఫ్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు. అప్లికేషన్ చివరి తేదీ 2023 డిసెంబర్ 23.శ

అడ్రస్ :
జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, దర్గామిట్ట, నెల్లూరు, ఎస్ పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా. (Office of the District Women, Child Welfare and Empowerment Officer, Dargamitta, Nellore, SPSR Nellore District.  Pin Code - 524001)

Advertisment
తాజా కథనాలు