Indian Navy Jobs: ఇండియన్ నేవీలో టెన్త్ అర్హతతో జాబ్స్.. మొత్తం 910 ఖాళీలకు నోటిఫికేషన్.. వివరాలివే!

ఇండియన్‌ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ, బీఎస్సీ అర్హతతో మొత్తం 910 ఖాళీలను భర్తీ చేయనుండగా ఆసక్తిగల అభ్యర్థులు 2023 డిసెంబర్ 31 వరకూ ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించింది.

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో టెన్త్ అర్హతతో జాబ్స్.. మొత్తం 910 ఖాళీలకు నోటిఫికేషన్.. వివరాలివే!
New Update

Indian Navy : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ నేవీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తమ శాఖలో ఉన్న ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 910 ఛార్జ్ మ్యాన్, సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్, మేట్ తదితర ఖాళీలను భర్తీ చేయనుండగా కింద చూపిన విధంగా ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించింది.

ఈ మేరకు ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐఎన్ సెట్ -01/2023) ప్రకారం పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
1. ఛార్జ్ మ్యాన్ (అమ్యూనిషన్ వర్క్ షాప్) : 22
2. ఛార్జ్ మ్యాన్ (ఫ్యాక్టరీ) : 20
3. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ (ఎలక్ట్రికల్) : 142
4. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ (మెకానికల్) : 26
5. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ (కన్ స్ట్రక్షన్) : 29
6. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ (కార్టో గ్రాఫిక్) : 11
7. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ (ఆర్మమెంట్) : 50
8. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సీ, నాజ్ గెజిటెడ్ ఇండస్ట్రీయల్, ట్రేడ్స్ మ్యాన్ మేట్ : 610

అలాగే ఇందులో కార్పెంటర్, ఇండస్ట్రియల్ పెయింటర్, ప్లంబర్, సర్వేయర్ సీవోపీఏ, డ్రెస్ మేకింగ్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీ మ్యాన్, ఎలక్ట్రోప్లేయర్ తదితర పోస్టులున్నాయి.

ఇది కూడా చదవండి : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రూ.500కే సిలిండర్ ఎప్పటినుంచంటే

ఇక అర్హతల విషయానికొస్తే.. పోస్టును అనుసరించి 10వ తరగతి పాసై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఎస్సీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. వయో పరిమితి 2023 డిసెంబర్ నాటికి ఛార్జ్ మ్యాన్,ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులకు 25 ఏళ్లు మించదారు. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ పోస్టులకు 27 ఏళ్లుండాలి.

అప్లికేషన్ ఫీజు.. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థలు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.295 దరఖాస్తు ఫీజు కట్టాలి.అసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా 2023 డిసెంబర్ 18 నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ అప్లై చేసుకోవాలి.

ఈ ఉద్యోగాల ప్రక్రియ అప్లికేషన్ స్ర్కీనింగ్, రాత పరీక్ష, డ్యాక్యూమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉద్యోగంలో అర్హత సాధించినవారికి నెలకు బెసిక్ శాలరీ రూ.18,000తో మొదలవగా రిటైర్ మెంట్ నాటికి 56,900 వరకూ చెల్లిస్తారు.

అధికారిక వెబ్ సైట్ : https://www.joinindiannavy.gov.in/#

#notification #indian-navy #910-vacancies
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe