GOOD NEWS: విజయవాడ ఎయిర్ పోర్ట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే!

విజయవాడ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేయనున్నారు. కేవలం డిగ్రీ అర్హత, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్స్ ఉండనున్నాయి.

New Update
vijayawada airport jobs

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. విమానాశ్రయంలో ఉద్యోగం చేసే సదావకాశం వచ్చింది. విజయవాడ విమానాశ్రయంలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఒక్క విజయవాడ మాత్రమే కాకుండా లేహ్, పోర్ట్ బ్లెయిర్, గోవా, సూరత్ ఎయిర్‌పోర్ట్‌లో 274 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

 ఇది కూడా చదవండి: కేసీఆర్ కు ఆహ్వానం అందించిన మంత్రి పొన్నం..!

విషయం ఏంటంటే ఈ ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేయనున్నారు. కేవలం పోస్టుకు తగ్గ అర్హతలుంటే చాలు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం కల్పిస్తారు. అయితే హిందీ, ఇంగ్లీష్‌పై మంచి పట్టు ఉండాలి. 

అలాగే లోకల్ భాషలో మాట్లాడగలగాలి. అందువల్ల తెలుగు యువతకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. విజయవాడ ఎయిర్‌పోర్టులో అయితే తెలుగు స్పష్టంగా మాట్లాడేవారికి ఇది చక్కటి అవకాశం. డిగ్రీ మార్కులు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఇందులో సెలెక్ట్ అయితే మంచి సాలరీ అందుకుంటారు.

ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం

అర్హత

కనీసం డిగ్రీ విద్యార్హత ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి 60 శాతం పైగా మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులుంటే సరిపోతుంది. 

వయస్సు

01.11.2024 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 27 ఏళ్లలోపు వుండాలి. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

జీతం

ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి ఉద్యోగంలో చేరిన అభ్యర్థులకు తొలి
ఏడాదిలో ప్రతినెలా రూ.30,000 వేతనం చెల్లిస్తారు. అలాగే రెండో సంవత్సరం మరో రూ.2వేలు పెంచుతారు. దీంతో నెల జీతం రూ.32,000లకు చేరుతుంది. అలాగే మూడో సంవత్సరం మరో రూ.2 వేలు పెంచి రూ.34,000 వేలు ఇస్తారు. 

దరఖాస్తు విధానం

అభ్యర్థులు www.aaiclas.aero వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
ఆ తర్వాత సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి. 
ఈ నెల డిసెంబర్ 10 సాయంత్రం 5.00 లోపు దరఖాస్తును ఫిల్ చేసి ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి.

ఎంపిక

ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఇంటర్వ్యూ ఎప్పుడు

దరఖాస్తుల స్వీకరణ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ తేదీ, టైమింగ్స్ దరఖాస్తులో పేర్కొన్న మెయిల్‌కి వస్తాయి. దాని ప్రకారమే ఇంటర్వ్యూకి హాజరు కావాలి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు