Fake universities: విద్యార్థులకు UGC వార్నింగ్.. దేశంలో 32 ఫేక్ యూనివర్సిటీలు.. లిస్ట్ ఇదే!

యూజీసీ వెబ్‌సైట్‌లోని గణాంకాల ప్రకారం.. గత ఏడాది అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా 22 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉండగా, 2026 ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 32కి చేరింది. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే 10 కొత్త నకిలీ వర్సిటీలు వెలుగులోకి రావడం విద్యాశాఖను కలవరపెడుతోంది.

New Update
Fake universities

హైయ్యర్ స్టడీస్ కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కీలక హెచ్చరిక జారీ చేసింది. దేశంలో నకిలీ విశ్వవిద్యాలయాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థుల అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని విద్యాసంస్థలు అక్రమంగా డిగ్రీలు అమ్ముతూ వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని యూజీసీ వెల్లడించింది.

యూజీసీ వెబ్‌సైట్‌లోని గణాంకాల ప్రకారం.. గత ఏడాది అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా 22 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉండగా, 2026 ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 32కి చేరింది. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే 10 కొత్త నకిలీ వర్సిటీలు వెలుగులోకి రావడం విద్యాశాఖను కలవరపెడుతోంది.

రాష్ట్రాల వారీగా నకిలీ వర్సిటీల జాబితా:

ప్రస్తుత అడ్మిషన్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని యూజీసీ విడుదల చేసిన జాబితాలో దేశ రాజధాని నగరం అగ్రస్థానంలో ఉంది. అత్యధికంగా 12 ఫేక్ వర్సిటీలు.. ఉత్తరప్రదేశ్‌లో 4 నకిలీ వర్సిటీలు ఉన్నాయని తెలిపింది. ఏపీ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ ఒక్కో రాష్ట్రంలో రెండేసి చొప్పున సర్టిఫికేట్లు అమ్ముకునే యూనివర్సిటీలు ఉన్నాయట. రాజస్థాన్, ఝార్ఖండ్, హరియాణా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.

నకిలీ విశ్వవిద్యాలయాల మాయలో పడితే కేవలం డబ్బు మాత్రమే కాదు, విలువైన సమయం, విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా నాశనమవుతుంది. ఈ వర్సిటీలు జారీ చేసే సర్టిఫికేట్లకు ఎలాంటి చట్టబద్ధత ఉండదు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలకు ఈ డిగ్రీలు చెల్లుబాటు కావు. ఇతర గుర్తింపు పొందిన సంస్థల్లో పీజీ లేదా పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ సర్టిఫికేట్లు పనికిరావు.

విద్యార్థులకు యూజీసీ సూచనలు

ఏదైనా విశ్వవిద్యాలయంలో చేరడానికి ముందు విద్యార్థులు ఈ క్రింది అంశాలను పరిశీలించాలని యూజీసీ విజ్ఞప్తి చేసింది.
గుర్తింపు చెక్ చేయాలి: సదరు వర్సిటీకి UGC లేదా AICTE నుంచి అధికారిక గుర్తింపు ఉందో లేదో సరిచూసుకోవాలి.
డిగ్రీ ఇచ్చే అధికారం: కేవలం చట్టబద్ధంగా ఏర్పడిన వర్సిటీలకు మాత్రమే డిగ్రీలు ఇచ్చే అధికారం ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్: ఏదైనా సందేహం ఉంటే వెంటనే యూజీసీ అధికారిక వెబ్‌సైట్ (ugc.ac.in) సందర్శించి, 'Fake Universities' జాబితాను తనిఖీ చేయాలి.

Advertisment
తాజా కథనాలు