యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్టుల్లో మార్పులు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరడానికి యూజీసీ ప్రవేశ పరీక్షలు పెడుతుంది. ఈ పరీక్షలు ఇంతకముందు హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించే వాళ్లు కానీ, 2025 నుంచి కేవలం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలోనే ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు యూజీసీ వెల్లడించింది.
Read Also : తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. MPTCల సంఖ్య పెంపు!?
ప్రవేశ పరీక్షలో 63 సబ్జెక్టులు ఉండగా వాటిని 37కు కుదించారు. ఇక నుంచి విద్యార్థులకు గరిష్టంగా 5 సబ్జెక్టులకు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని తెలిపింది. గతంలో సబ్జెక్టు బట్టి ఎగ్జామ్ టైం 45 నిమిషాల నుంచి 60 నిమిషాలుగా ఉండేది. ప్రస్తుతం ఆ సమయాన్ని ఎగ్జామ్‌తో సంబంధం లేకుండా 60 నిమిషాలుగా నిర్ణయించడంతో పాటు ఆప్షనల్ ప్రశ్నల కాన్సెప్ట్ క్యాన్సల్ చేస్తున్నామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొంది. ఇప్పటి నుంచి విద్యార్థులు చదివిన ఇంటర్మీడియేట్ సబ్జెక్టులతో సంబంధం లేకుండా యూజీలో ఏ సబ్జెక్టునైనా సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించింది.
Read Also :రెండు రోజులు స్కూల్స్, కాలేజీలు బంద్.. ఎందుకంటే?
Also Read : మీనాక్షి చౌదరికి శ్రీలీల షాక్.. డ్యాన్సింగ్ క్వీన్ కి అదిరిపోయే ఆఫర్