TGPSC : గ్రూప్-4 ఫైనల్ రిజల్ట్స్ ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తైనట్లు తెలుపుతూ.. ఉద్యోగాలకు ఎంపికైన 8084 మంది అభ్యర్థులు వివరాలను అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల లిస్ట్ ఇదే.. Group 4 Final Results List.pdf గ్రూప్-4 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 8,084 ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఇందుకోసం 7,26,837 మంది ర్యాంకులను(జనరల్ ర్యాంకింగ్) ఇప్పటికే ప్రకటించింది. తుది ఎంపికల కోసం 1:3 ఎంపిక చేశారు. 2022 డిసెంబర్ 1న ఇచ్చిన నోటిఫికేషన్‌లో భాగంగా 8,084 పోస్టులకు గాను 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీజీపీఎస్సీ కమిషన్ పేర్కొంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.in గతేడాది 2023 జులై 1న టీజీపీఎస్సీ గ్రూప్ 4 పరీక్షలను నిర్వహించింది. అయితే ఆ తర్వాత ఎన్నికలు రావటంతో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఉద్యోగాల భర్తీపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) దృష్టి సారించింది. ఇందుకోసం 7,26,837 మంది ర్యాంకులను (జనరల్ ర్యాంకింగ్) ప్రకటించింది . అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే.