TG Group-3: గ్రూప్‌-3 అభ్యర్థులకు అలర్ట్.. షెడ్యూల్‌ విడుదల!

తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్ డేట్ ఇచ్చింది. నవంబర్‌ 17, 18 తేదీల్లో జరగబోయే పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎగ్జామ్‌కు వారం ముందునుంచే హాల్ టికెట్స్ అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపింది. 

TS EdCET: టీఎస్ ఎడ్ సెట్ 2024 షెడ్యూల్ విడుదల..రాతపరీక్షతేదీ ఇదే..!!
New Update

TG Group-3: తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్ డేట్ ఇచ్చింది. నవంబర్‌ 17, 18 తేదీల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు నవంబర్ 9 లేదా 10వ తేదినుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచబోతున్నట్లు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. అంతేకాదు మోడల్‌ ఆన్సర్‌ బుక్‌లెట్లను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. 

ఇది కూడా చదవండి: మరో ఏడు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. మరికంటి భవానికి కీలక పదవి!

33 పరీక్ష కేంద్రాలు..


ఇక నవంబ‌ర్‌ 17, 18 తేదీల్లో జరిగే గ్రూప్‌–3 పరీక్షల కోసం 33 పరీక్ష కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.  రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి తన కార్యాలయం నుంచి కలెక్టర్లు, పోలీస్‌ అధికారులతో గ్రూప్‌– 3 పరీక్షలపై వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 9,792 మంది అభ్యర్థులు గ్రూప్‌– 3 పరీక్ష రాయనున్నారని తెలిపారు. అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, దేవసహాయం, ఏఎస్పీ రామేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1388 గ్రూప్‌-3 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

ఇది కూడా చదవండి: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి.. 100 మంది మృతి

పెరిగిన ఖాళీలు.. 


మొదట 1363 పోస్టులతో 2022 డిసెంబర్ 30వ తేదీన TSPSC Group 3 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ పోస్టులకు బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులను అదనంగా చేర్చడంతో మొత్తం పోస్టుల సంఖ్య 1375కి పెరిగింది. అనంతరం నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. దీంతో మరోసారి 13 పోస్టులు కలపడంతో మొత్తం కొలువుల సంఖ్య 1,388కి పెరిగాయి. ఈ TSPSC Group 3 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

#tgpsc #tspsc-group-3
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe