TG TET Notification: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2024 నవంబర్ 5 నుంచి 20వ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 2025 జనవరి 1 నుంచి 20వ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
జాబ్ క్యాలెండర్ ప్రకారమే..
ఇక ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా 2024 మే 20వ నుంచి జూన్ 2 వరకు పరీక్షలు నిర్వహించింది. అయితే రెండో టెట్‌కు నవంబరులో నోటిఫికేషన్ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని గత ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలో ప్రభుత్వం వెల్లడించగా.. ఇచ్చిన మాట ప్రకారమే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇ
ఇది కూడా చదవండి: ప్రభాస్ కు జోడిగా నయనతార.. 17 ఏళ్ళ తర్వాత క్రేజీ కాంబో రిపీట్
అర్హతలివే..
టెట్ పేపర్-1కు డీఈడీ, పేపర్-2కు బీఈడీలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఇక స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత ఉండాలని నిర్ణయించగా.. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టెట్ రాయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఆరుసార్లు పరీక్షలు నిర్వహింగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వహిస్తుండటంపై సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. https://tstet2024.aptonline.in/tstet/
ఇది కూడా చదవండి: Viral Video: మనిషివా.. రబ్బరు బొమ్మవా?..బాడీని అలా తిప్పావేంటి బ్రో