RRB నుంచి కీలక అప్డేట్.. 14,298 జాబ్స్‌.. ఛాన్స్‌ మిస్‌ చేసుకోవద్దు!

RRBలో 14,298 టెక్నీషియన్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకున్నవారు తప్పులు ఉంటే ఒకసారి చెక్ చేసుకుని సవరణలు చేసుకోవాలని రైల్వే రిక్రూట్‌మెంట్ తెలిపింది. సవరణ చేసుకునే వారు rrbapply.gov.in ఈ వెబ్‌సైట్లకి వెళ్లి అక్టోబర్ 17 నుంచి 21 వరకు గడువులోగా పూర్తి చేయాలి.

New Update
Govt Jobs : నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు సవరణలు చేసుకోవడానికి ఇండియన్ రైల్వే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే గడువు పూర్తయ్యి అప్లై చేసుకున్న వారంతా ఒకసారి చెక్ చేసుకోవాలని, ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని తెలిపింది. మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు తప్పకుండా మళ్లీ ఒకసారి చెక్ చేసుకోవాలని రైల్వే రిక్రూట్‌మెంట్ తెలిపింది. 

ఇది కూడా చూడండి: Infosys: రెండో త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం.. ఎన్ని కోట్లంటే?

ఈ గడువు తేదీలోగా..

దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు చేయాలనుకునే అభ్యర్థులు బోర్డు వెబ్‌సైట్ అయిన rrbapply.gov.in లోకి వెళ్లాలి. మీరు దరఖాస్తు చేసుకున్న డిటైల్స్‌తో సవరణలు చేసుకోవాలి. ఈ సవరణ అక్టోబర్ 17 నుంచి 21 వరకు మాత్రమే గడువు ఉంటుందని తెలిపింది. ఈ తేదీలోగా మాత్రమే సవరణలు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే  దరఖాస్తు తేదీ పూర్తికావడంతో.. ఏవైనా తప్పులు ఉంటే సవరణ చేసుకోవాలని తెలిపింది. 

ఇది కూడా చూడండి: Sajjala ramakrishna reddy: తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయానన్న సజ్జల

టెక్నీషియన్ గ్రేడ్‌ పరీక్షకు అప్లై చేసుకున్నవారికి 90 నిమిషాల సమయంలో పరీక్ష ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉండగా అందులో జనరల్ అవేర్‌నెస్ నుంచి 10, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ నుంచి 20, మ్యాథ్స్ నుంచి 20, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. అయితే ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది.

ఇది కూడా చూడండి:  BIG BREAKING: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!

టెక్నీషియన్ గ్రేడ్-III పరీక్ష కూడా 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్ నుంచి 10, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25, మ్యాథ్స్ నుంచి 25, జనరల్ సైన్స్ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 40%, ఓబీసీ అభ్యర్థులు 30%, ఎస్సీ అభ్యర్థులు 30%, ఎస్టీ అభ్యర్థులు 25% స్కోర్‌లు సాధించాల్సి ఉంటుంది. 

ఇది కూడా చూడండి: Israel: యహ్యా సిన్వార్ మృతి..ధృవీకరించిన ఇజ్రాయెల్

Advertisment
తాజా కథనాలు