RBI Assistant Jobs : RBIలో 650 అసిస్టెంట్ పోస్టులు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

New Update
rbi jobs

RBI Assistant 2026 Notification :  . అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి మార్చి 8, 2026 వరకు గడువు ఉంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది

50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ మరియు పిడబ్ల్యుబిడి అభ్యర్థులకు ప్రభుత్వం, ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఉత్తీర్ణత మార్కులు ఉంటే సరిపోతుంది. ఇక వయస్సు విషయానికి వస్తే, అభ్యర్థుల వయస్సు 20 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ rbi.org.in సందర్శించి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 16 నుండే ఈ లింక్ అందుబాటులోకి వచ్చింది. చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే అభ్యర్థులు గడువు ముగియక ముందే దరఖాస్తు చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

ప్రతి ఏటా ఆర్బీఐ నిర్వహించే ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. కేంద్ర బ్యాంకులో ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉన్నవారికి ఇది ఒక మంచి సువర్ణావకాశం.

అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, గువహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్ & లక్నో, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం వంటి అనేక RBI కార్యాలయాలలో మొత్తం 650 అసిస్టెంట్ పోస్టులను ప్రకటించారు.

ఎంపిక మూడు దశల్లో నిర్వహించబడుతుంది:
ప్రిలిమినరీ పరీక్ష
ప్రధాన పరీక్ష
భాషా ప్రావీణ్య పరీక్ష (LPT)

భాషా ప్రావీణ్య పరీక్ష సంబంధిత రాష్ట్ర అధికారిక లేదా స్థానిక భాషలో నిర్వహించబడుతుంది. ఆ భాషలో ప్రావీణ్యం లేని అభ్యర్థులు అనర్హులు.

Advertisment
తాజా కథనాలు