APSSDC: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీకోసమే ఈ అవకాశం

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ జాబ్ మేళా అవకాశం వినియోగించుకోండి. ఇందులో మీరు ఎంపికైతే నెలకు రూ.20వేల వరకు వేతనం అందుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..అటవీశాఖలో 689 ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..!!
New Update

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త అందించింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC). ఈ నెల 22న వైఎస్సార్ కడప జిల్లాలో మరో జాబ్ మేళా (AP Job Mela) నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance): ఇంటర్న్‌షిప్/ట్రైనీ అసోసియేట్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ప్రొబేషనరీ ఆఫీసర్ తదితర విభాగాల్లో 30 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్ తదితర విద్యార్హతతో పాటు 20-30 సంవత్సరాల లోపు వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు వైఎస్సార్ కడప జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ జిల్లాతో పాటు ఏపీ, తెలంగాణ , తమిళనాడు రాష్ట్రాల్లోనూ పరిస్థితుల ఆధారంగా పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది. ట్రైనీ అసోసియేట్‌గా ఎంపికైన వారికి తొలి ఆరు నెలల పాటు నెలకు రూ.10వేల వేతనం ఉంటుంది.

బిగ్ బాస్కెట్ (Big Basket): డెలివరీ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారు హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుంది. నెలకు రూ.18 వేల వరకు వేతనంతో పాటు ఇన్సెంటివ్స్ చెల్లించనున్నారు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునే వారి వయసు 18-30 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి.

పబ్లిషింగ్ హౌస్(MGI Technologies): డేటా కలెక్షన్&అసోసియేట్ ఎడిటర్ విభాగాల్లో 20 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, ఎంఎస్సీ (BZC, BSC, MPC) అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12,500-రూ.14000 వేల వరకు వేతనం ఉంటుంది. 21-28 సంవత్సరాల లోపు అమ్మాయిలు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 22న ఉదయం 9 గంటలకు డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్, ఓ బ్లాక్, కలక్టరేట్ ఆఫీసులో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఏమైనా సందేహాలు ఉంటే ఇతర వివరాల కోసం 9908808914 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.

Also Read: Latest Job Notifications

#ap-skill-development #apssdc-recruitment-2023 #apssdc-jobs-recruitment-2023 #apssdc-job-mela #apssdc-job-mela-2023 #apssdc #ap-job-mela #big-basket-jobs #muthoot-finance-jobs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి