Career Tips: ఉద్యోగంలో రాణించాలంటే ఇలా చేయండి.. తప్పక విజయం మీదే!

ఉద్యోగంలో పై స్థాయికి వెళ్లాలంటే ప్రవర్తన అన్నిటికంటే ముఖ్యం. తోటి ఉద్యోగులతో అస్సలు గొడవలు పెట్టుకోవద్దు. మీ ప్రవర్తన, మీ టైమింగ్స్‌, మీ స్కిల్, మీరు ఇతరులకు ఇచ్చే గౌరవం లాంటి విషయాల మీదనే మీ కెరీర్‌ ఆధారపడి ఉంటుంది. అందరినీ కలుపుకుపోవడం బెస్ట్.

Career Tips: ఉద్యోగంలో రాణించాలంటే ఇలా చేయండి.. తప్పక విజయం మీదే!
New Update

Career Tips:  మనం కెరీర్‌లో ఎదగాలంటే కష్టాన్ని నమ్ముకోని ఎదగాలి. అడ్డదారుల్లో ఎదగితే ఆ కొంతకాలం పనికి వస్తుంది. అదే కష్టాన్ని నమ్ముకుంటే అది మన జీవితం చివరి వరకు మనతోనే ఉంటుంది. ఇతరులు గౌరవం కూడా ఇస్తారు. అందుకే కెరీర్‌లో పైకి రావాలంటే కష్టపడడం అన్నిటికంటే ముఖ్యం. మరో విషయం ఏంటంటే చాలామంది చీటికి మాటికి కోపం తెచ్చుకుంటారు. కోపం అన్నది సహజ లక్షణం. అయినా కూడా అదే పనిగా కొలిగ్స్‌పై కోపం తెచ్చుకుంటే అది మీ ఎదుగుదలకు అడ్డంగా మారవచ్చు. ఎందుకంటే ప్రవర్తన అన్నిటికంటే ముఖ్యం. ఎంత టాలెంట్‌ ఉన్నా ప్రవర్తన మంచిగా లేకపోతే ఉద్యోగంలో ఎక్కువ కాలం కొనసాగలేం. అందుకే వర్క్‌ లైఫ్‌లో ఎక్కువగా కోపాన్ని ప్రదర్శించకూడదు.

job life

గొడవలు పడవద్దు:

  • ఎదుటవారి కష్టాలను, సమస్యలను అర్థం చేసుకోని, వారితో అందుకు తగ్గట్టుగా నడుచుకునే వారే జాబ్‌ చేసే చోట ఉత్తమ ఉద్యోగిగా ఎదుగుతారు. అంతేకాని తోటి కోలిగ్స్‌ను చులకన చేసి ఎప్పుడూ చూడకూడదు, వారిని తక్కువ చేసి ఇతరుల వద్ద కూడా మాట్లాడవద్దు. ఏదైనా తగాదా వచ్చినప్పుడు ఎదుటివారి కోణం నుంచి కూడా ఆలోచించాలి. గొడవల సమయంలో అవతలి వ్యక్తితో నేరుగా కలిసి మాట్లాడాలి.

ఎవరినీ బాధపెట్టవద్దు:

  • ఎక్కువ మంది మంచి మార్కులు వస్తే చాలు అని అనుకుంటారు. అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత మీ మార్కులు మీ ఎదుగుదలకు ఉపయోగపడవు. మీ ప్రవర్తన, మీ టైమింగ్స్‌, మీ స్కీల్, మీరు ఇతరులకు ఇచ్చే గౌరవం లాంటి విషయాల మీదనే మీ కెరీర్‌ ఆధారపడి ఉంటుంది. సౌమ్యంగా, ఎవరినీ బాధపెట్టని సమాధానాలు.. అందరితోనూ కలుపుకు పోయే మైండ్‌సెట్‌.. ఇలాంటివి ఉంటే.. ఉద్యోగంలో మీ సంస్థను మెప్పించడమే కాదు.. కెరీర్‌లోనూ ముందుకెళ్లడం ఖాయం!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అమ్మాయిలు హైహీల్స్ వేసుకుంటున్నారా..? అయితే రిస్క్‌ మీకే

#career-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe