JOBS: SSC CHSL తుది ఫలితాలు విడుదల..!

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామ్ 2023 తుది ఫలితాన్ని SSC ప్రకటించింది. టైర్-2 పరీక్ష ఫలితాల ఆధారంగా మొత్తం 1,211 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. SSC CHSL తుది ఫలితాలను ఎలా చెక్‌ చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
JOBS: SSC CHSL తుది ఫలితాలు విడుదల..!

SSC CHSL Results Out: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్(CHSL) ఎగ్జామినేషన్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. టైర్-2 పరీక్ష ఫలితాల ఆధారంగా మొత్తం 1,211 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. అభ్యర్థులందరూ కొత్త అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ని విజిట్ చేసి ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక SSC CHSL టైర్ 1 ఫలితం గతేడాది సెప్టెంబర్ 27న ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు నవంబర్ 2 నుంచి జనవరి 1 వరకు జరిగిన SSC CHSL టైర్ 2 పరీక్షకు హాజరయ్యారు. 14,548 మంది అభ్యర్థులు LDC, JSA, JPA పోస్టులకు సంబంధించిన పరీక్షకు హాజరయ్యారు. 1,679 మంది అభ్యర్థులు DESTలో DEO పోస్టుకు షార్ట్‌లిస్ట్ అయ్యారు. ఇక చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది.

ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి:
--> అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ని విజిట్ చేయండి.

--> హోమ్‌పేజీలో CHSLE ఫలితం 2023 లింక్‌పై క్లిక్ చేయండి.

--> CHSLE కట్-ఆఫ్, షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది.

--> ఫైల్‌ను చెక్‌ చేసి, డౌన్‌లోడ్ చేయండి.

--> ఫ్యూచర్ పర్పెస్ కోసం ఆ కాపీని ప్రింటవుట్ తీసుకోండి.

కొత్త వెబ్‌సైట్‌ రూల్స్‌ ఛేంజ్:
మరో ముఖ్యమైన విషయాన్ని ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమీషన్‌ పరీక్షలకు ఇకపై అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు తమ పాత ఫొటో పనకిరాదు. కొత్త వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు అభ్యర్థులు వారి లైవ్‌ ఫొటోను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. SSC ఇటీవల కొత్త వెబ్‌సైట్ ssc.gov.in ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. పాత SSC వెబ్‌సైట్ ssc.nic.in లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఏ అభ్యర్థి అయినా మళ్లీ రిజిస్ట్రర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త వెబ్‌సైట్‌ను విజిట్ చేసి మళ్లీ వివరాలు నమోదు చేసుకోవాలి. కొత్త వెబ్‌సైట్‌లో చేసిన OTR మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించిన తర్వాత అనేక మార్పులు చేసింది SSC.

Also Read: 10లక్షల మంది విద్యార్థులకు అండ.. నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ!

Advertisment
Advertisment
తాజా కథనాలు