దున్నపోతు ట్రీట్‌మెంట్‌ ట్వీట్... దేనికి సంకేతం..?

తెలంగాణ బీజేపీలో మరో లొల్లి మొదలైంది. జితేందర్ ట్వీట్‌తో ఒక్కసారిగా బీజేపీ కలకలం రేపుతోంది. దున్నపోతును తన్ని ట్రాలీలో ఎక్కించే వీడియోను ట్రీట్ చేసిన జితేందర్‌రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలను కూడా ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరం అంటూ కామెంట్ చేశారు. ఆ ట్వీట్‌ను అమిత్‌షా, బీఎల్ సంతోష్, బన్సల్‌కు జతచేసిన జితేందర్‌.. వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు

దున్నపోతు ట్రీట్‌మెంట్‌ ట్వీట్... దేనికి సంకేతం..?
New Update

Jitender Reddy controversial tweet

వివాదాస్పద ట్వీట్

మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్ చేశారు. సొంత పార్టీ నేతల తీరును విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతోంది. తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరమంటూ ఓ ట్వీట్‌ చేశారు. దున్నపోతుల్ని తన్నుకుంటూ ఓ వ్యక్తి ట్రాలీలో ఎక్కిన వీడియోను పోస్ట్‌ చేశారు ఇది తెలంగాణ బీజేపీకి అవసరమంటూ క్యాప్షన్‌ ఉంచారు. ఆయన కాసేపటికే దానిని డిలీట్‌ చేసి.. మళ్లీ పోస్ట్‌ చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పైగా ఆ ట్వీట్‌కు అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌, సునీల్‌ బన్సాల్‌ లాంటి అగ్రనేతలను ట్యాగ్‌ చేశారు.

బీజేపీలో అంతర్గత విబేధాలు

ఈ మధ్య తెలంగాణ బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత విబేధాలు నడుస్తున్నాయనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే జితేందర్ రెడ్డి చేసిన ట్విట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్నారా..? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఈ ట్వీట్ దేనికి సంకేతం? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ ట్వీట్ వివాదాస్పదం అవుతుందని ఆయనకు ముందే తెలుసని, కావాలనే ఈ ట్వీట్ చేసి వైరల్ అయిన తర్వాత డిలీట్ చేశారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బీజేపీలో సీనియర్ నేతగా జితేందర్‌రెడ్డి ఉన్నారు. పార్టీలో ఎప్పటినుంచో కొనసాగుతున్నారు. బీజేపీలో జాతీయ స్థాయి పదవిలో ఉన్నారు. అలాంటి ముఖ్యనేత సొంత పార్టీ నేతలపై విమర్శలు కురిపించడం ప్రస్తుతం బీజేపీలో దుమారం రేపుతోంది

ట్వీట్‌పై బీజేపీ నేతల ఆరా
ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలను ఒక వీడియో ద్వారా జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారని చెబుతున్నారు. అధ్యక్ష స్థానం నుంచి బండి సంజయ్ ను మారుస్తారని, నేతల మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం నేపథ్యంలో జితేందర్‌రెడ్డి ట్విట్ చేశారని మరికొందరు చర్చించుకుంటున్నారు. జితేందర్‌రెడ్డి ట్వీట్ పై బీజేపీ నేతలు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే స్టేట్ బీజేపీలో చర్చకు వచ్చింది. మొత్తంగా జితేందర్ రెడ్డి ట్విట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe