JIO OTT Free Plans: వెబ్ సిరీస్‌లు, షోలు లేదా సినిమాలను చూడటానికి చాలా సార్లు ఓటీటీ ప్లాట్‌ఫాంల్లో విడిగా రీఛార్జ్‌లు చేయాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వినియోగదారులకు చేతి చమురు భారీ మొత్తంలో వదులుతుంది. అయితే జియో దీని నుంచి ఉపశమనం కలిగించే అనేక ప్లాన్లను ప్రవేశపెట్టింది. జియో ఇప్పుడు తన వినియోగదారులకు డజనుకు పైగా OTT సేవలకు సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.
జియో చవకైన ఓటీటీ ప్లాన్ ధర రూ. 148గా ఉంది. అయితే ఇది డేటా ఓన్లీ ప్లాన్. ఈ ప్లాన్ వినియోగదారులకు 10 జీబీ అదనపు డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ రీఛార్జ్‌తో మీరు సోనీలివ్, జీ5 వంటి 12 ఓటీటీ ప్లాట్‌ఫాంలకు యాక్సెస్ లభిస్తుంది.ఈ ప్లాన్ 28 రోజుల పాటు ప్రతిరోజూ 2 జీబీ డేటాను అందిస్తుంది. దీనితో పాటు అదనంగా మరో 6 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ కింద మీరు సోనీలివ్, జీ5 వంటి 12 ఓటీటీ ప్లాట్‌ఫాంల కంటెంట్ చూడవచ్చు.
జియో రూ. 1198 ప్లాన్‌లో కూడా చాలా ఓటీటీ వినోదాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ కింద మీరు 84 రోజుల పాటు ప్రతిరోజూ 2 జీబీ డేటాను పొందుతారు. దీంతో పాటు 18 జీబీ అదనపు డేటా లభిస్తుంది. జియో అందిస్తున్న అత్యంత ఖరీదైన ప్లాన్. దీని వాలిడిటీ 365 రోజులుగా ఉంది. ఇందులో రోజువారీ ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇది కాకుండా ప్రతిరోజూ 2 జీబీ అదనపు డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో మీరు ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్ హాట్‌స్టార్ వంటి 14 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కంటెంట్‌ను చూడవచ్చు. ఈ ప్లాన్ 78 జీబీ అదనపు డేటాను కూడా అందిస్తోంది.