Jio Premium : జియో సినిమా బంపర్ ఆఫర్‌.. రూ.299 కే వార్షిక ప్లాన్

రిలయన్స్ కంపెనీకి చెందిన జియో సినిమా ప్రీమియం ప్లాట్‌ఫాం వార్షిక ప్లాన్‌ ధర రూ.599 ఉండగా.. ప్రారంభం ఆఫర్ కింద వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర 50 శాతం తగ్గించారు. దీంతో కేవలం రూ.299 కే జియో సరికొత్త ప్లాన్‌ లభించనుంది.

New Update
Jio Premium : జియో సినిమా బంపర్ ఆఫర్‌.. రూ.299 కే వార్షిక ప్లాన్

Reliance Industries : రిలయన్స్ కంపెనీకి చెందిన స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమా ప్రీమియం (Jio Cinema Premium) ఓ కొత్త వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం నెలవారీ ప్లాన్‌ను తీసుకొచ్చిన జియో.. తాజాగా అందుబాటు ధరలో దీన్ని తీసుకొచ్చింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌ కింద యాడ్స్ లేకుండానే 4కే రిజల్యూషన్‌తో స్ట్రీమింగ్‌ వీడియోలు చూడొచ్చు. జియో తీసుకొచ్చిన వార్షిక ప్లాన్‌ (Jio Annual Plan) ధర రూ.599 ఉంది. అయితే ప్రారంభం ఆఫర్ కింద వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధరపై 50 శాతం తగ్గించనున్నారు. దీంతో కేవలం రూ.299 కే ప్లాన్‌ లభించనుంది. మొదటి 12 నెలల బిల్లింగ్ సైకిల్ ముగిసిన తర్వాత సబ్‌స్క్రిష్షన్ కావాలంటే పూర్తి స్థాయిలో రీఛార్జి చేయాల్సి ఉంటుంది.

Also read: చెన్నై లో భారీ వర్షం.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగేనా?

ఏడాది పాటు ఒక డివైజ్‌లో ఎలాంటి యాడ్స్ లేకుండా కంటెంట్‌ను 4కే క్వాలిటీతో చూడొచ్చు. అంతేకాదు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోని ఆఫ్‌లైన్‌లో కూడా చూసే సదుపాయం కల్పించారు. ఇప్పుడు జరుగుతున్న ఐపీల్‌ (IPL), ఇతర క్రీడలు, లైవ్‌ ఈవెంట్లు (Live Events) మాత్రం యాడ్స్‌తో వస్తాయి. అయితే జియో గతంలో తీసుకొచ్చిన వార్షిక ప్లాన్ రూ.999 కంటే ఇది చాలా తక్కువ.

ఇదిలాఉండగా.. ఇటీవల జియో రూ.29. రూ.89తో (ఫ్యామిలీ ప్యాక్) రెండు కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇవి నెలరోజుల వరకే వర్తిస్తాయి. సినిమాలు, పిల్లల షోలు, టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను స్మార్ట్‌ టీవీలతో పాటు ఏ డివైజ్‌లోనైనా వీక్షించవచ్చు. ప్రస్తుతం తీసుకొచ్చిన వార్షిక ప్లాన్‌లో కూడా ఇలాంటి సదుపాయలే ఉన్నాయి. జియో గత నెలలో ప్రీమియం ఫ్యామిలీ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను రూ.149 నుంచి రూ.89కి తగ్గించింది. ఈ ఆఫర్‌తో ఒకేసారి నాలుగు డివైజ్‌లలో కంటెంట్‌ను చూడొచ్చు.

Also Read: తెలంగాణ కేబినేట్ విస్తరణ తేదీ ఖరారు !

Advertisment
తాజా కథనాలు