Jio బెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.140 ఆదా.. 190GB డేటా ఉచితం..

మీరు జియో రీఛార్జ్ ప్లాన్స్ వాడుతున్నట్లైతే.. ఇప్పుడు మీరు ఓ మంచి రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. దీని వల్ల మీకు కొన్ని అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

New Update
Jio బెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.140 ఆదా.. 190GB డేటా ఉచితం..

Jio Recharge Plan: రిలయన్స్ జియో కంపెనీ తరచుగా.. రకరకాల రీఛార్జ్ ప్లాన్స్ తెస్తోంది. టెలికం రంగంలో ఈ సంస్థకు భారీ సంఖ్యలో కస్టమర్లు ఉన్నారు. నెట్ స్పీడ్ కూడా బాగానే ఉంటోందనీ, 5జీ అన్‌లిమిటెడ్ ఇవ్వడం కూడా కలిసొస్తోందని నెటిజన్లు చెబుతున్నారు. కొంతమంది జియో సిమ్ తప్ప వేరేది వాడట్లేదు. ఆ స్థాయిలో ఈ కంపెనీ ప్రజల్లోకి వెళ్లింది. మరి జియో తెచ్చిన మంచి రీఛార్జ్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం.

జియో కంపెనీ సంవత్సర ప్లాన్ ఇది. దీని వాల్యూ రూ.2999. దీనికి 4జీ డేటాతోపాటూ.. అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఆఫర్ ఉంది.ఈ ప్లాన్ ద్వారా మీరు 365 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. అలాగే రోజూ 2.5GB డేటా పొందుతారు. ఆ తర్వాత స్పీడ్ 64kbpsకి తగ్గుతుంది. దీనితోపాటూ మీరు జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్స్ పొందగలరు.ఈ ప్లాన్‌ చూడటానికి చాలా కాస్ట్‌లీ ప్లాన్ లాగా కనిపిస్తుంది. కానీ జియో ప్రకారం ఇది చాలా చవకైన ప్లాన్. ఎలాగంటే.. 28 రోజుల ప్లాన్ ప్రకారం చూస్తే.. ఈ ప్లాన్ నెలకు రూ.230 మాత్రమే అవుతుంది. అందువల్ల ఇది చవకైన ప్లాన్ అని కంపెనీ చెబుతోంది.

Also Read: బికినీతో బస్సు ఎక్కిన భామ..వీడియో చూసి ఫైర్ అవుతున్న నెటిజన్లు!

ఈ ప్లాన్‌ని 90 రోజుల వ్యాలిడిటీ ఉండే రూ.749 ప్లాన్‌తో పోల్చితే.. నెలకు రూ.230 చొప్పున 90 రోజులకు రూ.690 అవుతుంది. ఆ లెక్కన 3 నెలలకు రూ.59 ఆదా అయినట్లే. ఈ లెక్కన సంవత్సరానికి రూ.240కి పైగా ఆదా అయినట్లే. అలాగే.. రూ.749 ప్లాన్‌లో రోజుకి 2GB డేటా ఇస్తారు. రూ.2999 ప్లాన్‌లో రోజూ 2.5GB డేటా పొందుతారు. అందువల్ల 365 రోజులకు 190GB అదనంగా పొందినట్లు అవుతుంది. ఇలా నిపుణుల ప్రకారం ఈ వార్షిక ప్లాన్ బాగుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు