Fire Accident : టైర్ల గోదాంలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు!

జంషెడ్‌ పూర్‌ లో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బర్మా మైన్స్‌ ప్రాంతంలోని లాల్‌ బాబా ట్యూబ్‌ కంపెనీ ఆవరణలో ఉన్న టైర్ల గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.

New Update
Fire Accident : టైర్ల గోదాంలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు!

Tire Warehouse : జంషెడ్‌ పూర్‌(Jamshedpur) లో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. బర్మా మైన్స్‌(Burma Mines) ప్రాంతంలోని లాల్‌ బాబా ట్యూబ్‌ కంపెనీ ఆవరణలో ఉన్న టైర్ల గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టు పక్కల ప్రాంతాలన్ని కూడా దట్టమైన పొగతో కమ్ముకున్నాయి. ఈ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్‌ సర్క్యూటే(Short Circuit) ప్రమాదానికి కారణం అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా మండుతున్న ఎండల ప్రభావం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రాణ నష్టం ఏమి జరగలేదని అధికారులు వివరించారు.

గోదాములో టైర్లు నిల్వ ఉండడం వల్ల ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వివరించారు.

Also Read :  కీరాను పగలు డైమండ్ అని, రాత్రి జీలకర్ర అని ఎందుకు అంటారో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు