Amba Prasad : ఓవైపు ఈడీ విచారణ.. మరోవైపు వీడియో సాంగ్‌ తో అదరగొట్టేసిన మహిళా ఎమ్మెల్యే!

జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మహిళా ఎమ్మెల్యే అంబా ప్రసాద్‌ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మనీలాండరింగ్‌ కేసులో ఈడీ విచారణకు కొన్ని గంటల ముందు తాను స్వయంగా పాడి, ఆడిన ‘జియా హర్షాయే’ వీడియో సాంగ్ రిలీజ్ చేసి జనాలను ఆశ్చర్యపరిచింది.

Amba Prasad : ఓవైపు ఈడీ విచారణ.. మరోవైపు వీడియో సాంగ్‌ తో అదరగొట్టేసిన మహిళా ఎమ్మెల్యే!
New Update

Jharkhand : జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్(Congress) పార్టీ నాయకురాలు, మహిళా ఎమ్మెల్యే అంబా ప్రసాద్‌(Amba Prasad) వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మనీలాండరింగ్‌ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఆమె తాజాగా ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేసి జనాలను ఆశ్చర్యపరిచింది. సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) దాదాపు 6 గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. కాగా ఈడీ విచారణకు ముందు సొంతంగా పాడి, ఆడిన వీడియో సాంగ్‌ను విడుదల చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

నా మనసు కుదుటపడుతుంది..
ఈ మేరకు సోమవారం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి మరి ‘జియా హర్షాయే’ అనే పాటను అంబా ప్రసాద్‌ లాంచ్‌ చేశారు. ఇక ఈ వీడియో సాంగ్‌పై అంబా మాట్లాడుతూ.. ‘ఏదో చిన్న ప్రయత్నం చేశాను. చిన్నప్పటి నుంచే పాటలు, డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. సర్హోల్‌ పండుగ సందర్భంగా నా తొలి సాంగ్‌ రిలీజ్ చేశాను. సంగీతం నా జీవితంలో భాగం. ఎప్పుడు అవకాశం వచ్చినా వినియోగించుకుంటాను. మ్యూజిక్ వింటే నా మనసు కుదుటపడుతుంది. సంగీతం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని శాస్త్రీయంగా కూడా రుజువైంది’ అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: TSSPDCL APP : తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఒక్క క్లిక్ తో..

చిన్నప్పటి నుంచే అలవాటైంది..
అయితే ఈ పాట విడుదల అనంతరం సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈడీ కార్యాలయంలో అధికారులు ఆమెను ప్రశ్నించారు. దీనిపై మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం చిన్నప్పటి నుంచే అలవాటైంది. న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నా అంటూ చెప్పుకొచ్చింది.

#video-viral #jharkhand-congress-mla #amba-prasad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe