Anita Goyal: జెట్‌ ఎయిర్‌వేస్‌ ఫౌండర్ నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ మరణం

జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ ఈ తెల్లవారుజామున ముంబయి లోని ఒక ఆసుపత్రిలో మరణించారు. ఆమె క్యాన్సర్ తో బాధపడుతున్నారు. లోన్స్ ఫ్రాడ్ కేసులో జైలులో ఉన్న నరేష్ గోయల్ కొద్దిరోజుల క్రితం భార్య అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ పై ఉన్నారు

New Update
Anita Goyal: జెట్‌ ఎయిర్‌వేస్‌ ఫౌండర్ నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ మరణం

Anita Goyal: జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేష్‌ గోయల్‌ భార్య అనితా గోయల్‌ గురువారం ఉదయం ముంబైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.  లోన్ డిఫాల్ట్ కేసులో జైలులో ఉన్న నరేష్ గోయల్ ఇటీవలే మధ్యంతర బెయిల్‌ తో ఇంటికి వచ్చారు. దీంతో గోయల్‌ తన భార్య చివరి శ్వాస విడిచే సమయంలో ఆమె వెంటే ఉన్నారు.

Anita Goyal: అనితా గోయల్ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆసుపత్రిలో మరణించారని కుటుంబ సన్నిహిత వర్గాలు చెప్పాయి. విషాద వార్త తెల్సిన తరువాత  స్నేహితులు, కుటుంబ సభ్యలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈరోజు ఆమె అంత్యక్రియలు జరగవచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువస్తున్నారు. నరేష్ గోయల్ ప్రస్తుతం వారి ముంబై నివాసంలో ఉన్నారు. అనితా గోయల్‌-అనిల్ గోయల్ దంపతులకు ఇద్దరు పిల్లలు నమ్రత, నివాన్ గోయల్ ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో, నరేష్ గోయల్ తన భార్యతో కలిసి ఉండటానికి వైద్య, మానవతా కారణాలతో బొంబాయి హైకోర్టు నుండి మధ్యంతర బెయిల్ కోరారు. 

ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్.. సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కేనా?

Anita Goyal: అనితా గోయల్ జీవించడానికి కేవలం నెలల సమయం మాత్రమే ఉందని, ఆమె పక్కనే ఉండాలని ఆయన కోరుకుంటున్నారని అతని లాయర్లు పేర్కొన్నారు. గోయల్‌లు ఇద్దరూ క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు. మనీలాండరింగ్ ఆరోపణలపై నరేష్ గోయల్‌ను 2023 సెప్టెంబర్‌లో ED అరెస్టు చేసింది . జెట్ ఎయిర్‌వేస్‌కు కెనరా బ్యాంక్ ఇచ్చిన రూ.539 కోట్ల రుణాలను ఎగ్గొట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ED తన ఛార్జిషీట్‌ను సమర్పించిన తర్వాత, నవంబర్ 2023లో అనితా గోయల్‌ను కూడా అరెస్టు చేశారు. అయితే, క్యాన్సర్ కారణంగా ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, ప్రత్యేక కోర్టు అదే రోజు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

అనిల్ గోయల్ కూడా.. 

Anita Goyal: నిజానికి అనిల్ గోయల్ కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ కారణంతో ఆయన మధ్యంతర బెయిల్ కు అప్లై చేశారు. ఈ సందర్భంగా, జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు జీవించాలనే కోరికను కోల్పోయాడని నరేష్ గోయల్ తరపు న్యాయవాది బాంబే హైకోర్టుకు తెలిపారు. ఫిబ్రవరిలో, ప్రత్యేక న్యాయస్థానం నరేష్ గోయల్‌కు బెయిల్ నిరాకరించింది.  అయితే ఆయనకు  నచ్చిన ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకోవడానికి అనుమతించింది. తర్వాత, ఆయన  మెరిట్‌లపై మధ్యంతర బెయిల్,  వైద్య కారణాలతో విడుదల చేయాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు