CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్.. సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కేనా? లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విచారించి తుది తీర్పును వెల్లడించనుంది. కాగా ఇటీవల ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు జూన్ 1వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 16 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఇటీవల మధ్యంతరం బెయిల్ పై తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పలు సార్లు ఆయన వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం వాయిదా వేస్తూ వచ్చింది. ఇటీవల ఈ పిటిషన్ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ALSO READ: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్ అక్రమమని.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనుసందాల్లో ఈడీ పనిచేస్తుందని ఆరోపిస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు ఈ కేసు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దీనిపై తుది తీర్పు ను వెలువరించనుంది. కాగా సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పును పై యావత్ భారత్ మొత్తం వేచి చూస్తోంది. ఆయన కేసు నుంచుము బయటపడుతారా లేదా జైలు జీవితాన్ని కొనసాగిస్తారా? అనే చర్చ దేశ రాజకీయాల్లో నెలకొంది. మరికొన్ని గంటల్లో సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించనుంది. జూన్ 1వరకు మధ్యంతర బెయిల్.. ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు లో భారీ ఊరట లభించింది. జూన్ 1 వరకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తప్పనిసరిగా సరెండర్ కావాలని ఆదేశం ఇచ్చింది. సీఎంగా బాధ్యతలు నిర్వర్తించకూడదని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ సీఎం కోర్టులో పిటిషన్ దాఖలుచేయగా… విచారణ జరిపిన ధర్మాసనం కేజ్రీవాల్ కు సానుకూలంగా తీర్పు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. #cm-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి