JEE Main 2024 Session-1 Answer Key: జేఈఈ మెయిన్ మొదటి పేపర్ కీ ని విడుదల చేశారు. నిన్నరాత్రే ఈ కీని రిలీజ్ చేశామని చెబుతోంది జాతీయ పరీక్షల సంస్థ. ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీ తో పాటూ రెస్పాన్స్ షీట్‌లనూ అధికారి వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ప్రతీ పశ్రకూ రూ.200లు కట్టి ఛాలెంజ్ చేయవచ్చును. ఈ నెల 8 వరకు దీనికి అవకాశం ఉంది.
Also Read : https://rtvlive.com/ap-assembly-interim-budget-highlights/
అప్పటివరకే అనుమతి..
ఛాలేంజ్ చేసే అవకాశం 8వ తేదీ రాత్రి 11 గంటల వరకే ఉంది. అది దాటితే...డబ్బులు కట్టినా వాటిని పరిగణనలోకి తీసుకోరు. కానీ ఈ లోపు అభ్యర్ధులు రైజ్ చేసిన సందేహాలు సరైనవి అయితే ఆన్సర్ కీ ని సవరించి...పైనల్ కీని విడుదల చేస్తారు. ఆ తర్వాతనే ఫైనల్ రిజల్ట్‌ను కూడా ప్రకటిస్తారు.
ఎంత మంది రాసారంటే...
జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షకు 12,95,617 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 12,25,529 మంది పరీక్షను రాశారు. ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్స్ కోసం ఈ క్రింది లింక్ ను ఉపయోగించి తెలుసుకోవచ్చును.