Karnataka: జేడీ(ఎస్) పార్టీ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్

సెక్స్ స్కాండల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీ(ఎస్) తమ పార్టీ నుంచి బహిష్కరించింది. జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ పార్టీ నేతలు, బీజేపీ నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
Karnataka:  జేడీ(ఎస్) పార్టీ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్

Prajwal Revanna: సెక్స్ స్కాండల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీ(ఎస్) తమ పార్టీ నుంచి బహిష్కరించింది. ఇతని మీద లైగింకారోపణలు చాలానే వచ్చాయి. పోలీసు కేసు కూడా నమోదయ్యింది. అది కాక వీడియోలు కూడా చలానే బయటపడ్డాయి.ఇదంతా పార్టీ ప్రతిష్టను దెబ్బ తీస్తుందని...అందుకే అతనని పార్టీ నుంచి స్పెండ్ చేయాలని నిన్న పలువురు నేతలు అధినేత దేవెగౌడ్కు లేఖలు రాశారు. దీని మీద అందరితో చర్చించిన దేవెగౌడ ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహాష్కరిస్తున్నట్టు  ప్రకటించారు.

సెక్స్ స్కాండల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ మీద గట్టి దెబ్బే పడేట్టు ఉంది. ఇప్పటికే ఇతని మీద పోలీస్ కేసు నమోదు అయింది. దానికి తోడు ఎలక్షన్స్‌లో పాల్గొనకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఇతన్ని పార్టీ నుంచి కూడా బహిష్కరించనున్నారు. దీని మీద మరి కాసేపటిలో జేడీ(ఎస్) పార్టీ తమనిర్ణయాన్ని ప్రకటించనుంది. ప్రస్తుతం ఈ పార్టీ బీజేపీతో ఎలయెన్స్‌లో ఉంది. ప్రజ్వల్ మీద ఆరోపనలు చాలా బలంగా ఉండడం, దానికి తోడు ఆధారాలు కూడా దొరకడంతో చర్యలు తప్పవనే అంటున్నారు. పార్టీలో అందరూ అతనికి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇద్దరు , ముగ్గురు నేతలు పార్టీ అధినేత దేవెగౌడకు దీనికి సంబంధించి లేఖలు కూడా రాశారు. 

దేశానికి తిరిగి రప్పిస్తాం..

మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణను ఇండియా తిరిగి రప్పిస్తామని చెబుతోంది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఐపీఎస్‌ బి.కె.సింగ్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో ఇద్దరు మహిళా ఎస్పీలు కూడా ఉన్నారు. ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ కేసులో ప్రభుత్వం జోక్యం చేసుకోదని చెప్పేసింది. ఇక సిట్ టీమ్ వీడియోలకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ విభాగానికి పంపుతారు. మిగిలిన ఆధారాలను సేకరిస్తారు. వీటిల్లో కనుక నిజాలు నిరూపితం అయితే ప్రజ్వల్‌ను సిట్ టీమ్ ఇండియా తీసుకు వస్తుంది. అయితే ఈ కేసును ఏళ్ల ఏళ్ళు సాగదీయకుండా తొందరగా విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారురాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వర. అంతేకాదు ఈ కేసులో అవసరమైతే బాధితులు, ఫిర్యాదుదారులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని తెలిపారు.

Also Read:Karnataka: కర్ణాటకలో మారుమోగుతున్న ప్రజ్వల్ రేవణ్ణ పేరు..అసలెవరితను?

Advertisment
Advertisment
తాజా కథనాలు