/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ferna-jpg.webp)
Spanish Women Fernanda 4ever: విదేశాల నుంచి భారతదేశం చూడ్డానికి వచ్చే మహిళల మీద ఆకృత్యాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. రీసెంట్‌గా స్పెయిన్ నుంచి ఓ మహిళను జార్ఖండ్‌లో (Jharkhand) గ్యాంగ్ రేప్ చేశారు. మొత్తం పది మంది స్పానిష్ మహిళ దారుణంగా రేప్ చేశారు. ఆమె భర్త నుంచి దూరంగా లాక్కుని వెళ్ళి.. అతనికి కనిపిస్తుండగానే ఆమెపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.
బైక్ యాత్రికులు..
స్పెయిన్ నుంచి వచ్చిన ఇద్దరు భార్యాభర్తలు బైక్ మీద యాత్రలు చేస్తున్నారు. వీరు బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్‌లోని దుమ్కాకు చేరుకుని...అక్కడ నుంచి బీహార్ మీదుగా నేపాల్‌కు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రికి దుమ్కా చేరుకున్నారు. రాత్రి అవడంతో కుంజి గ్రామం దగ్గరలో టెంట్ వేసుకుని పడుకున్నారు. దీనిని గమనించిన కొందరు దుండుగులు టెంట్‌లో నిద్రిస్తున్న మమిళను అక్కడి నుంచి లాక్కుని వెళ్ళి గ్యాంగ్ రేప్ చేశారు. చుట్టుపక్కల జనాలు లేకపోవడంతో స్పానిష్ మహిళ సహాయం కోసం ఎంత అరిచినా లాభం లేకపోయింది. ఘటన జరిగిన తర్వాత భార్యభర్తలు ఇద్దరూ దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. దీనఇ మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేప్ చేసిన వాళ్ళల్లో ముగ్గురిని పట్టుకున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న చంపై సోరెన్ ప్రభుత్వం.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్‌ను ఏర్పాటు చేసింది.
This couple was travelling internationally however the lady was gangraped and her husband was beaten brutally... both of them needs justice... insta - fernanda.4ever@AmitShahOffice @AmitShah @DrSJaishankar @JharkhandCMO @JharkhandPolice @rashtrapatibhvn @randomsena @randomsenaa pic.twitter.com/sLTIjaWBWz
— Shreeganesh Mehendale (@ShreeganeshMeh3) March 2, 2024
భర్త ఆవేదన ..
తనకు జరిగిన అన్యాయం మీద స్పానిష్ భార్యాభర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇందులో ఆమె భర్త జరిగిన సంఘటనను వివరించారు. ఈ వీడియోను థ్రెడ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ఎంతమంది కలిసి రేప్ చేసింది...ఎలా జరిగింది అన్న విషయాలను వివరంగా చెప్పారు. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడింది. పోలీసులు ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
Also Read:National: ఇల్లంత లిఫ్ట్..ప్రపంచంలోనే అత్యంత పెద్దది..ముంబయ్ వరల్డ్ జియో సెంటర్‌లో