కలలను చూడాలనుకునే వారి కల నేరవేరుస్తున్న జపాన్ శాస్త్రవేత్తలు.. ఎలాగో తెలుసా?

నిద్రలో వచ్చే కలలను చూడాలనుకునేవారికి జపాన్ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. డ్రీమ్స్ రికార్డ్ చేసి ప్లే చేయగల డివైజ్ ను కనుగొన్నారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి మన కలల ప్రపంచాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు. ఈ వీడియోలను ప్లే బ్యాక్ కూడా చేయొచ్చు.

New Update
కలలను చూడాలనుకునే వారి కల నేరవేరుస్తున్న జపాన్ శాస్త్రవేత్తలు.. ఎలాగో తెలుసా?

డ్రీమ్ అనేది మానవుని రహస్య ప్రపంచం. ఇది ఎల్లప్పుడూ మానవాళిని ఆకర్షిస్తుంది. అయితే భవిష్యత్తు ఎదుగుదలకోసం కనే కలలకు, నిద్రలో వచ్చే కలలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కలల శాస్త్రం ప్రకారం కలలను భవిష్యత్తు అంటారు మానసిక నిపుణులు. మీరు కలలో ఏది చూసినా.. దానికి కచ్చితంగా ఏదో అర్థం ఉంటుందని చెబుతుంటారు. కొన్ని కలలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తే మరికొన్ని భయాందోళనకు గురిచేస్తాయి. నిజానికి కొన్ని కలలు ఏ పరిస్థితిలో వచ్చాయో కూడా మనకు గుర్తుండదు. మరి నిద్రలో కనిపించే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, అనుభవాలను చలనచిత్రంలా చూడగలిగితే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. అందుకే తమ కలలను చూడాలనుకునే వారి కల నేరవేర్చేందుకు జపాన్ శాస్త్రవేత్తలు అద్భుతమైన పరికరాన్ని ఆవిష్కరించారు.

Also read :IND VS AUS: మోదీ గడ్డపై తొడగొట్టేదేవరు..? ఫైనల్‌ ఫైట్‌కు సిద్ధమైన రోహిత్‌ టీమ్‌

ఈ మేరకు మనిషి కలలను రికార్డ్ చేసి ప్లే చేయగల డివైజ్ ను ఇటీవల కనుగొన్నారు జపాన్ శాస్త్రవేత్తలు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి మన కలల ప్రపంచాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు. న్యూరోఇమేజింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పురోగతిపై ఆధారపడిన ఈ పరికరం.. కల స్థితులతో పాటు సంక్లిష్టమైన నాడీ కార్యకలాపాలను సంగ్రహిస్తుంది. వాటిని అద్భుతమైన విజువల్ రిప్రజెంటేషన్స్ గా మారుస్తుంది. మోడ్రన్ అల్గారిథమ్‌లతో బ్రెయిన్ ఇమేజింగ్ పద్ధతులను ఏకీకృతం చేయడం ద్వారా డ్రీమ్స్ విజువల్ కంటెంట్‌ను డీకోడింగ్ చేయడంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు. కలలను వీడియో సీక్వెన్స్‌లుగా మార్చగల సామర్థ్యం ఉన్న పరికరాన్ని రూపొందించారు. ఇక ఇలా రికార్డ్ చేసిన వీడియోలను ప్లే బ్యాక్ కూడా చేయొచ్చు. ఇటీవల కొంతమంది గాఢ నిద్రలో ఉన్నప్పుడూ ఈ ప్రయోగం చేసిన సైంటిస్ట్ లు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిజంగా తమ కలలను చూసుకున్నపుడు కొందరు హ్యాపీగా ఫీల్ అయితే మరికొందరు ఆందోళన చెందినట్లు వెల్లడించారు. ఒక రకంగా ఇలాంటి ప్రయోగాలు సక్సెస్ కావడం ఆనందించదగినదే అయినప్పటికీ మరికొన్నిసార్లు ప్రమాదకరమనే వాదనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆందోళన కలిగించే కలలను చూసుకున్నప్పుడు మనిషి మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు