Pushpa 2 : పుష్ప2 సినిమాలో జాన్వీ కపూర్? ఆ స్పెషల్ సాంగ్ కోసమేనా?

సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా సృష్టించిన రికార్డులు ఇంకా మర్చిపోలేదు ప్రేక్షకులు. ఇప్పుడు పుష్ప 2 రెడీ అయిపోతోంది. పుష్ప సినిమాలో ఊ అంటావా మామా లాంటి స్పెషల్ సాంగ్ ఇందులోనూ ఉంటుందట. దానిలో జాన్వీకపూర్ సందడి చేయబోతోందని టాలీవుడ్ టాక్!

Pushpa 2 : పుష్ప2 సినిమాలో జాన్వీ కపూర్? ఆ స్పెషల్ సాంగ్ కోసమేనా?
New Update

Pushpa 2 : ఊ అంటావా మామా.. ఊఊ అంటావా అంటూ సమంత(Samantha) చేసిన హంగామా ఇంకా ఎవరూ మర్చిపోలేదు. సుకుమార్-బన్నీ(Sukumar-Bunny) కాంబినేషన్ లో వచ్చి దేశవ్యాప్తంగా మాసివ్ రికార్డులు సృష్టించిన పుష్ప సినిమాలోని ఆ స్పెషల్ పాట.. అంతే స్పెషల్ గా రికార్డులు క్రియేట్ చేసింది. పుష్ప సినిమా హిట్ కావడంలో ఈ పాటకు కూడా మంచి భాగమే ఉంది. ఇప్పుడు పుష్ప 2 సినిమా రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా కోసం ఆ పాటను మించేలా ఒక సాంగ్ రెడీ చేశారు దేవీ శ్రీ ప్రసాద్. అయితే, మొదటి పార్ట్ లో కంటే రెండో పార్ట్ లో ఈ సాంగ్ మరింత అదరగొట్టే బీట్స్ తో ఉంటుందట. అందుకే, ఈ సాంగ్ కోసం ఎవరిని తీసుకోవాలి అనే విషయంలో ఎన్నో ఆలోచనలు చేస్తూ వస్తోంది సినిమా టీమ్. ముందు దీని కోసం సమంతను తీసుకోవాలని అనుకున్నారు. కానీ, ఆ ఆలోచన పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. తరువాత ఈ స్పెషల్ సాంగ్(Pushpa 2) కోసం దిశాపటానీ రంగంలోకి దిగింది అని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆమె పేరు కూడా వెనక్కి వెళ్లిపోయిందని తెలుస్తోంది. 

పుష్ప 2(Pushpa 2) సినిమాని ఆగస్టు 15కి రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమాకి మరింత హైప్ ఇచ్చే స్పెషల్ సాంగ్ కోసం స్పెషల్ స్టార్ ని దింపాలని చూస్తున్నారట. అందుకే, అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో ఈ సాంగ్ చేయించడానికి ఫిక్స్ అయ్యారట సుకుమార్ అండ్ కో. ఇప్పటికే ఆమెతో కూడా మాట్లాడారనీ.. జాన్వీ కూడా ఒకే చెప్పిందనీ టాలీవుడ్ టాక్. పుష్ప కోసం సమంత చేసిన ఆ స్పెషల్ సాంగ్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ నుంచి వస్తున్న ఈ వార్త నిజం అయితే కనుక పుష్ప2(Pushpa 2) లో ఈ స్పెషల్ సాంగ్ జాన్వీ చేస్తే అది మరో పెద్ద సంచలనం కావడం ఖాయం అని అందరూ అంటున్నారు. 

Also Read : ఆ విషయంలో రామ్ చరణ్ కంటే.. ఎన్టీఆర్ వెనుకబడిపోతున్నాడా? కారణం అదేనా?

ఇక ఇప్పుడు జాన్వీ(Janhvi) ఎన్టీఆర్(NTR) తో దేవర సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా జాన్వీకపూర్ హీరోయిన్. ఈ రెండు సినిమాలు కాకుండా మరికొన్ని సినిమాల కోసం కూడా నిర్మాతలు జాన్వీకపూర్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు పుష్ప2(Pushpa 2)లో జాన్వీ కపూర్ కనిపిస్తుంది అనేది కన్ఫర్మ్ అయితే, శ్రీదేవి లానే జాన్వీకపూర్ కూడా టాలీవుడ్ లో మంచి స్థాయికి చేరుకుంటుందని అంచనాలు వేస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, జాన్వీకపూర్ నటించిన ఒక్క సినిమా కూడా తెలుగులో ఇప్పటివరకూ రిలీజ్ కాలేదు. కానీ, ఆమె కోసం డిమాండ్ మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. 

ప్రస్తుతం శరవేగంగా  ముస్తాబవుతున్న  'పుష్ప 2'(Pushpa 2)లో రష్మిక మందన్న(Rashmika Mandanna), ఫహద్ ఫాసిల్, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ కథ, స్క్రిప్ట్, దర్శకత్వం నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మిరెస్లోవ్ కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్ రామకృష్ణ - మోనికా నిగోత్రే ప్రొడక్షన్ డిజైనర్లు. చంద్రబోస్ సాహిత్యం అందించగా, రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్, 'డ్రాగన్' ప్రకాష్, కేచా, నవకాంత్ యాక్షన్ సన్నివేశాలను సమకూర్చారు. దీపాలి నూర్, శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మైక్ హెదయాతి, కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్లుగా ఉన్నారు. అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో మంచి క్వాలిటీతో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద హిట్ కాగా, రెండో భాగం మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. అందుకే వీలైనంత ఎక్కువ సమయం తీసుకుని మంచి క్వాలిటీతో థియేటర్లలో ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నాడు సుకుమార్.

జాహ్నవీ కపూర్ డాన్స్ వీడియో మీకోసం.. 

#tollywood #janhvi-kapoor #allu-arjun-pushpa-2
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి