Pawan Kalyan : నేడు అనకాపల్లిలో పవన్ ప్రచారం.. పవన్ స్పీచ్ పై ఉత్కంఠ!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు అనకాపల్లిలో ప్రచారం నిర్వహించనున్నారు. అనకాపల్లి నెహ్రు చౌక్ దగ్గర వారాహి విజయభేరి సభలో ఆయన పాల్గొంటారు. దీంతో ఆయన ఏం మాట్లాడుతారు? వైసీపీపై ఎలాంటి విమర్శలు చేస్తారు అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Pawan Kalyan : నేడు అనకాపల్లిలో పవన్ ప్రచారం.. పవన్ స్పీచ్ పై ఉత్కంఠ!
New Update

Anakapalle : జ్వరం రావడంతో ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan).. విశ్రాంతి తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. అనకాపల్లి జిల్లాలో నేడు పవన్ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. అనకాపల్లి నెహ్రు చౌక్ దగ్గర వారాహి విజయభేరి సభలో ఆయన పాల్గొంటారు. హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ వరకు నిర్వహించనున్న భారీ బైక్‌ ర్యాలీ(Bike Rally) లో ఆయన పాల్గొంటారు. రేపు ఎలమంచిలిలో పవన్ ప్రచారం చేస్తారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో మూడు స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. ఈ రోజు ప్రచారంలో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతారు? అధికార వైసీపీపై ఎలాంటి విమర్శలు చేయనున్నారు అన్న అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠ నెలకొంది.

Also Read : అతడు నయ వంచనకు నిలువెత్తు నిదర్శనం: కృపారాణి

#bike-rally #janasena #pawan-kalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe