Janasena: మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు.. సీఎం జగన్ పై జనసేన మహిళ సెక్రటరీ విమర్శలు

రానున్న ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామని జగన్ మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారని జనసేన మహిళా విభాగం సెక్రటరీ పెండ్యాల శ్రీలత అన్నారు. దిగువ స్థాయి వర్గాల నుంచి అన్ని వర్గాలలో వైసీపీ పాలన పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని విమర్శలు గుప్పించారు.

New Update
Janasena: మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు.. సీఎం జగన్ పై జనసేన మహిళ సెక్రటరీ విమర్శలు

Ananthapuram: రానున్న ఎన్నికలలో 175 సీట్లు గెలుస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారని జనసేన మహిళా విభాగం సెక్రటరీ పెండ్యాల శ్రీలత అన్నారు. దిగువ స్థాయి వర్గాల నుంచి అన్ని వర్గాలలో జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని విమర్శలు గుప్పించారు. కాబట్టి రానున్న ఎన్నికలలో సీఎం జగన్ కి తగిన బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని శ్రీలత అభిప్రాయపడ్డారు.

Also Read: ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడిపై హత్యాయత్నం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరిని గౌరవించే తీరును బట్టి జనసేన పార్టీలో చేరామని చెప్పుకొచ్చారు. జనసేనాని చెప్పిన విధంగా మహిళలు తమ కాళ్ళ మీద నిలబడేలా వేళ్లాది మందికి కుట్టు మిషన్, ఎంబ్రాయిడరీ పెయింటింగ్ వంటి వాటిలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే అగ్రికల్చర్ లో సామాన్య రైతులను గుర్తించి వారికి తమ పొలాలను ఇచ్చి అభివృద్ధి చెందేలా ప్రయత్నం చేశామని వెల్లడించారు.

Also Read: చంద్రబాబు ఛాలెంజ్ కు మాజీ మంత్రి కొడాలి నాని రియాక్షన్..!

అయితే, అకాల వడగండ్ల వర్షాల వల్ల పంటలు చేతికి రాలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకముందు కూడా ఈ ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తామని వ్యాఖ్యానించారు. రాయలసీమలో సీట్ల విషయం జనసేన అధినేత పవన్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని పెండ్యాల శ్రీలత అన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే అంశం మా అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని..జనసేనాని ఏమి చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు జనసేన రాష్ట్ర మహిళ నాయకురాలు పెండ్యాల శ్రీలత.

Advertisment
Advertisment
తాజా కథనాలు