2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, ఎన్నికల్లో ఓడినా అనతికాలంలోనే తన పోరాట కార్యక్రమాలతో జనసైనికుల్లో రాష్ట్ర వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. “కాబోయే సీఎం పవన్ కళ్యాణ్” అంటూ 300 రోజులకుపైగా నెల్లూరు నగరంలోని ఇంటింటికీ చాటింపు వేసేలా పవనన్న ప్రజాబాట చేపట్టారు. ప్రతి ఇంటికీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ స్టిక్కర్లు అంటించారు. నిలువెత్తు కరపత్రాలు పంచారు. నెల్లూరు మొత్తం సీఎం పవన్‌కళ్యాణ్ అంటూ పోస్టర్లతో నింపారు. ఆఖరికి సీఎం పవన్ కళ్యాణ్ అంటూ నగరంలో శిలాఫలకం కూడా పెట్టారు. పార్టీ కోసం నిరంతరం సైనికుడిలా సేవ చేస్తున్నా తనకు పార్టీలో అవమానాలే ఎదురవుతున్నాయని ఆయన గత కొంతకాలంగా మదనపడుతున్నారు. తాను పార్టీలో ఎంత కష్టపడుతున్నా.. గుర్తించక తన నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి చేత పార్టీలోని పలువురు పెద్దలు చిల్లర రాజకీయాలు చేయిస్తున్నారని ఆయన ఇటీవల పవన్ కళ్యాణ్ దగ్గర వాపోయినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Janasena: జనసేనకు భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేత.. ఎవరో తెలుసా?
2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, ఎన్నికల్లో ఓడినా అనతికాలంలోనే తన పోరాట కార్యక్రమాలతో జనసైనికుల్లో రాష్ట్ర వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు.
Translate this News: