/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-25T165919.579.jpg)
AP News: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సాధారణ హోటల్లో భోజనం చేసి జనాల మనసు గెలుచుకున్నారు. ఈ మేరకు మంగళవారం రాజధాని ప్రాంతంలోని హైకోర్టుకు వెళ్లే దారిలోని కాకా హోటల్లో సామాన్యుల్లో ఒకడిగా కలిసిపోయి మధ్యాహ్నం లంచ్ చేశారు. ఇందుకు సబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఆహారం, ఆహార్యం ముఖ్యం కాదని చాటి చెప్పారంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. పేదలకు మేలు చేయడమే తమ ఎజెండా అంటూ జన సైనికులు నాయకర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.