జనసేన అంటే ప్యాకేజీ పార్టీ.. అబద్దాల పార్టీ

ప్రజలను మోసం చేసే పార్టీ జనసేన అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సీరియస్‌ అయ్యారు. పేదలు సుఖంగా ఉంటే పవన్‌ కల్యాణ్‌ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ముద్రగడను చంద్రబాబు ఏ రకంగా హింసించారో నీకు తెలియదా? అని పవన్‌ను ప్రశ్నించారు.

New Update
జనసేన అంటే ప్యాకేజీ పార్టీ.. అబద్దాల పార్టీ

Janasena means package party.. party of liars

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరోసారి హాట్‌ కామెంట్లు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన భీమవరం సభపై సస్పెన్స్ క్రియేట్ చేసిన పవన్ తన ప్రసంగాన్ని తుస్సుమనిపించారు అంటూ సెటైర్లు వేశారు. యువకులు, రైతులు, శ్రామికులు మోసపోతున్నారు అంటూ అబద్దాలు ఆడారు. జనసేన అంటే ప్యాకేజీ పార్టీ.. అబద్దాల పార్టీ.. కానీ, సీఎం జగన్ మేనిఫెస్టోను భగవద్గీతా, బైబిల్, ఖురాన్‌గా భావిస్తారని తెలిపారు. ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భావించే వ్యక్తి సీఎం జగన్‌ అని కొనియాడిన ఆయన. పవన్ తనని తాను ఎందుకు మోసం చేసుకుంటారు..? మహనీయుల పేర్లు చెబుతూ నీచమైన రాజకీయాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.

ఉసరవెల్లి కంటే ఎక్కువ రంగులు

పవన్ పార్టీ పెట్టి.. చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారని విమర్శించారు గ్రంధి. అయితే ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు హింసిస్తే అన్ని వర్గాలు బాధ పడ్డాయి. మీరు చేసిన దాష్టికాలు భరించలేకే ప్రజలు మిమ్మల్ని ఓడించారన్న ఆయన. 2019లో విడివిడిగా పోటీ చేస్తున్నాం అంటూ ప్రజలకు చెవిలో పువ్వుపెట్టే ప్రయత్నం చేశారు. పవన్ ఉసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చుకున్నారని మండిపడ్డారు. నాకు సీఎం పదవి ఎవరు ఇస్తారని పవన్ మాట్లాడారు.. నాకు మీరంతా ఓట్లు వేయలేదంటూ సొంత పార్టీ వాళ్లను అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు. మహనీయుల పేర్లు పలుకుతూ వారికి అపవిత్రత ఆపాదిస్తున్నారు. పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్ పేరు చెబుతూ ఒంటరిగా వెళ్లి ఆత్మార్పణ చేయాల్సిన పని లేదంటారు.

డంపింగ్ యార్డ్ కోసం రహస్యంగా కార్యాచరణ

చంద్రబాబు మద్యపాన నిషేదం ఎత్తేశారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని సపోర్ట్ చేస్తూ మద్యపాన నిషేదం సాధ్యం కాదంటున్నారని విమర్శించారు. చంద్రబాబులో భగత్ సింగ్, పొట్టి శ్రీరాములు, చేగువేరా కనిపిస్తున్నారెమో పవన్ కల్యాణ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. భీమవరం వచ్చి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడిన పవన్.. అంతకు ముందు పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వారిని ప్రశ్నించలేదని మండిపడ్డారు. ఇక, డంపింగ్ యార్డ్ కోసం రహస్యంగా కార్యాచరణ చేస్తున్నాం.. లేదంటే కోర్టులో అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌.

Advertisment
Advertisment
తాజా కథనాలు