Kadapa: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచార రంగంలో దూకిన పార్టీలు పోటా పోటీగా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అధికార పార్టీ సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అనే ఫ్లెక్సీలు కూడా వేయించారు. అయితే, ఈ ఫ్లెక్సీలపై ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. దేనికి సిద్ధం జగన్ అంటూ దుమ్మెత్తిపోశారు. ఇలా కొంతవరకు ఫ్లెక్సీల మాటల యుద్ధం నడిస్తే పలుచోట్ల ఫ్లెక్సీల వార్ కూడా నడుస్తోంది. జనసేన, టీడీపీ ఫ్లెక్సీలను అధికార పార్టీ నేతలు తొలగించారంటూ కేసులు కూడా నమోదు అయ్యాయి. అంతేకాదు ఇరుపార్టీ నేతలు గొడవలకు దిగి రచ్చ రచ్చ చేసిన వార్తలు కూడా మనం చూసాం.
Also Read: RTV ఎక్స్‌క్లూజివ్.. దెయ్యంతో ఒక రాత్రి.. అసలు కాండ్రకోటలో ఏం జరుగుతోంది..!
తాజాగా, కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరులో ఫ్లెక్సీల రగడ నెలకొంది. జనసేన పార్టీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేసినట్లు తెలుస్తోంది. దీంతో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు మాత్రం ఈ ఫిర్యాదుపై ఏ మాత్రం చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఘటనపై మూడు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని జనసైనికులు మండిపడుతున్నారు. సహనం నశించిన జనసేన నేతలు తమకు న్యాయం చేయాలని స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
Also Read: కాళేశ్వరంపై కాంగ్రెస్ డ్రామాలు.. కృష్ణ నీటిపై బీఆర్ఎస్ నాటకాలు: బండి సంజయ్
నిందితులపై ఫిర్యాదు చేసినా చర్యలు ఎందుకు తీసుకోవడం నిలదీశారు. వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తే అఘమేఘాలపై స్పందించే పోలిసులు తామ ఫిర్యాదు చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. జగన్ సిద్ధం అనే పోస్టర్లు ఏనాడు కూడా ఎక్కడా చించలేదని..కానీ, జనసేన ఫ్లెక్సీలను ఎందుకు చించుతున్నారని మండిపడ్డారు. మేం ఇచ్చిన కంప్లైంట్ పై చర్యలు తీసుకోండి అంటే కోర్టులో పర్మిషన్ తీసుకుని చర్యలు తీసుకుంటారంటారా? అని ఫైర్ అయ్యారు.