Janasena: 'పవన్ పెళ్లిళ్ల గురించి కాదు జగన్ .. ముందు మీ ఎమ్మెల్యేలను కాపాడుకో'.. కిరణ్ రాయల్ కౌంటర్.!

సీఎం జగన్‌పై జనసేన నేత కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్ పిల్లల ముందు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై మాట్లాడాల్సిన మాటలేనా అని మండిపడ్డారు. పవన్ పెళ్లిళ్ల గురించి కాకుండా.. ముందు మీ ఎమ్మెల్యేలను కాపాడుకో అంటూ జగన్ కు కౌంటర్ వేశారు.

Janasena: 'పవన్ పెళ్లిళ్ల గురించి కాదు జగన్ .. ముందు మీ ఎమ్మెల్యేలను కాపాడుకో'.. కిరణ్ రాయల్ కౌంటర్.!
New Update

Janasena Kiran Rayol Comments: ఏపీ సీఎం జగన్  నిన్న భీమవరంలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఆ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయంపై విమర్శలు గుప్పించారు. పవన్ మ్యారేజ్ స్టార్ అంటూ సెటైర్లు వేశారు. రియల్ లైఫ్ లో ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన మూడు సంవత్సరాలు కూడా కాపురం చేసి ఉండరని..పెళ్లి అనే సంప్రదాయాన్ని మంటగలుపుతున్నాడని ఫైర్ అయ్యారు. దీంతో, సీఎం జగన్ పై జనసైనికులు రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. పిల్లలకు విద్యా దీవెన డబ్బు వేయడానికి వెళ్లి పవన్ వ్యక్తి గత విషయాలు వారి ముందు మాట్లాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ‘పవన్ కళ్యాణే కాదు.. ఎవరు పోటీ చేసినా విజయం నాదే’ వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు.!

విద్యా దీవెన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ను దూషించడాన్ని తప్పుపట్టారు జనసేన నేత కిరణ్ రాయల్. ముందు మీ ఎమ్మెల్యేలను కాపాడుకో అంటూ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చదువుకునే విద్యార్థులు ముందు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు గురించి మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. పిల్లలకు ఏం చేశామో చెప్పాల్సింది పోయి పవన్ గురించి చెడుగా మాట్లాడం ఏంటని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు వస్తున్న ఆదరణ చూసి జగన్ భయపడి నిత్యం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై దూషిస్తున్నారని ఫైర్ అయ్యారు.
Also Read: విశాఖలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో గందరగోళం.!

ముఖ్యమంత్రికి జగన్ కు రాష్ట్రంలో ఏమి జరిగినా డివైడ్ పాలిటిక్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ప్రజలు మర్చిపోతారని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసిపిని జనసేన టిడిపి చిత్తుచిత్తుగా ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గంధి శ్రీనివాస్ ఈసారి ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని సవాల్ విసిరారు. షర్మిల రాకతో రాష్ట్రంలో వైసిపి నావకు గండిపడిందని ఎద్దేవా చేశారు.

#andhra-pradesh #ap-cm-ys-jagan #janasena-chief-pawan-kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe