/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/DEPUTY-CM-PAWAN-.jpg)
Pawan Kalyan: విజయవాడ క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రెండు ఫైల్స్‌పై పవన్ సంతకం చేశారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యాన వన పనులను అనుసంధానించి నిధులు మంజూరుపై తొలి సంతకం, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారు. మధ్యాహ్నం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్-1,2 అధికారులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12:30కి పంచాయతీ రాజ్ సెక్రటరీ అసోసియేషన్ తో సమావేశం అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటలకు మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు.