Pawan Kalyan: జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు రెండు బిట్లు కొనుగోలు చేశారు. బుధవారం మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్యలో పవన్ కళ్యాణ్ పేరున రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇందులో రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని, పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని బహిరంగసభలో ప్రజలకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ రూ.15 – 16 లక్షల మేర ఉంది. మరో పదెకరాల తోటలు జనసేన నేతలు కొనేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కళ్యాణ్.. ఇకపై అక్కడే!
AP: పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు రెండు బిట్లు కొనుగోలు చేశారు.
Translate this News: