Pawan Kalyan: పవన్‌కు రూ.64.26 కోట్ల అప్పు.. మరి ఆస్తి ఎంతో తెలుసా?

AP: పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు పవన్. తన ఐదేళ్ల సంపాదన 114.76 కోట్లుగా ఉందని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనకు అప్పులు రూ.64.26 కోట్లు ఉన్నట్లు తెలిపారు. తన దగ్గర 3.15 లక్షలు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు.

Pawan Kalyan: పవన్‌కు రూ.64.26 కోట్ల అప్పు.. మరి ఆస్తి ఎంతో తెలుసా?
New Update

Pawan Kalyan Affidavit: పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పోటీ చేస్తున్నారు. తన ఐదేళ్ల సంపాదన 114.76 కోట్లుగా ఉందని పేర్కొన్నారు జనసేనాని. తన దగ్గర 3.15 లక్షలు..భార్య చేతిలో 19 వేల 340 రూపాయలు ఉన్నాయన్నారు. నలుగురు పిల్లలను డిపెండెంట్‌గా పేర్కొన్నారు. తన పేరిట బ్యాంకులో 16 కోట్ల 48 లక్షల 18 వేల 524 డిపాజిట్, భార్య పేరిట బ్యాంకులో 86 లక్షల 5 వేల 300, నలుగురు పిల్లలు ఒక్కొక్కరి పేరిట 80 లక్షలకుపైగా డిపాజిట్లు ఉన్నాయన్నారు.

గత అయిదేళ్ళలో పవన్ కళ్యాణ్ సంపాదన రూ.114,76,78,300. ఇందుకు సంబంధించి ఆదాయ పన్నుగా రూ.47,07,32,875, జీఎస్టీకి రూ.26,84,70,000 చెల్లించారు. పవన్ కళ్యాణ్  అప్పులు రూ.64,26,84,453 ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46 కోట్ల 70 లక్షలు ఉన్నాయి.

Also Read: నెత్తుటి చరిత్ర.! మావోయిస్టుల ఉద్యమాలు ఎక్కడ నీరుగారిపోతున్నాయి?

పిఠాపురం (Pithapuram) నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) పోటీ చేస్తున్నారు. తన ఐదేళ్ల సంపాదన 114.76 కోట్లుగా ఉందని పేర్కొన్నారు జనసేనాని. తన దగ్గర 3.15 లక్షలు..భార్య చేతిలో 19 వేల 340 రూపాయలు ఉన్నాయన్నారు. నలుగురు పిల్లలను డిపెండెంట్‌గా పేర్కొన్నారు. తన పేరిట బ్యాంకులో 16 కోట్ల 48 లక్షల 18 వేల 524 డిపాజిట్, భార్య పేరిట బ్యాంకులో 86 లక్షల 5 వేల 300, నలుగురు పిల్లలు ఒక్కొక్కరి పేరిట 80 లక్షలకుపైగా డిపాజిట్లు ఉన్నాయన్నారు.

బాండ్స్‌పై 15.48 లక్షల పెట్టుబడి ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు పవన్. తన పేరిట 14 కోట్ల విలువైన వాహనం, అకిరా పేరిట వాహనం ఉందన్నారు. కుటుంబం దగ్గర 18 వందల 95 గ్రాముల బంగారం ఉందని వెల్లడించారు. తన దగ్గర ఎలాంటి కమర్షియల్ బిల్డింగ్‌లు లేవన్నారు. కుటుంబానికి 65.76 కోట్ల అప్పు ఉందన్నారు జనసేన అధినేత. తనపై 5 కేసులు ఉన్నాయని అఫిడవిట్‌లో తెలిపారు. ప్రభుత్వానికి 73.92 కోట్ల పన్నులు చెల్లించానన్నారు. ఐదేళ్లల్లో 20 కోట్లు విరాళాలు అందజేశానని పొందపరిచారు. వివిధ సంస్థలకు 3.32 కోట్ల విరాళాలు ఇచ్చామన్నారు పవన్.

విరాళాలు రూ.20 కోట్లుపైనే..

పవన్ కళ్యాణ్ వివిధ సంస్థలకు, జనసేన పార్టీ (Janasena Party) చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు అందించారు. ఇందులో జనసేనకు రూ.17,15,00,000 ఉన్నాయి. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాలలో విరాళాలు ఇచ్చారు. వివిధ సంస్థలకు రూ.3,32,11,717 విరాళాలు అందచేశారు.

ఆ వివరాలు..

* కేంద్రీయ సైనిక్ బోర్డు - రూ.1 కోటి

* పీఎం సిటిజెన్ ఆసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్ – రూ.1 కోటి

* ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి – రూ.50 లక్షలు

* తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి – రూ.50 లక్షలు

* శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ – రూ.30,11,717

* పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ – రూ.2 లక్షలు

#janasena #ap-elections-2024 #pawan-kalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe