Also Read : అయో ‘రామా’.. ఎంత మోసం జరిగిపోయిందన్న😢!
ఈ క్రమంలోనే గిద్దలూరు(Giddalur) నుండి రాజకీయా భవిష్యత్ అని స్వతంత్రంగా చెప్పకనే చెబుతున్నారు స్వాములు. నిన్నటికి నిన్న గిద్దలూరు తన వర్గీయులు, కాపు సంగం నాయకులతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. తనను నమ్ముకోన్నవారి కోసం త్వరలో ఒక నిర్ణయం చెబుతానని స్వాములు తెలిపారు. ఇప్పటికే పలు దఫాలు రాష్ట్ర కాపు నాయకులతో మాట్లాడినట్లు సమాచారం.
Also Read: నేటి నుంచే కార్తీకదీపం-2.. నెట్టింట్లో జోరుగా మీమ్స్..ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాకేనా?
ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారనే వార్తల నేపథ్యంలో స్వాములు మరో ముద్రగడ కానున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే బాటలో తమ్ముడు కృష్ణమోహన్ కూడా ఉన్నారని తెలుస్తోంది. చీరాల నుండి బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. రహస్యంగా తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీని ప్రభావం ఆయా నియోజకవర్గాల తోపాటు మరి కొన్ని నియోజకవర్గాలలో ప్రభావం చూపేలా పరిస్థితి కనిపిస్తోంది.