Perni Nani: గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత.. పేర్నినానిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి!

మాజీ మంత్రి పేర్నినానిపై జనసైనికులు గుడివాడలో రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల చేసిన నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేత శివాజీ ఇంటిముందు ధర్నాకు దిగారు.

New Update
Perni Nani: గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత.. పేర్నినానిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి!

Gudiwada: ఏపీలో జనసేన, వైసీపీ నాయకుల మధ్య వార్ నడుస్తోంది. పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని క్షమాపణ చెప్పాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు పేర్ని నాని కారుపై జనసేన కార్యకర్తలు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు.

బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ..
గుడివాడలోని వైసీపీ నేత తోట శివాజీ ఇంటికొచ్చిన పేర్ని నానిపైకి జనసేన కార్యకర్తలు దూసుకొచ్చారు. కొంతమంది రాళ్లతో దాడి చేయగా పేర్నినాని కారు అద్దాలు పగిలిపోయాయి. దాడి అనంతరం శివాజీ ఇంటిముందు ధర్నాకు దిగిన జనసైనికులు నాని బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పేర్ని నాని క్షమాపణ చెప్పే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని జనసైనికులు చెబుతున్నారు.

పేర్ని నాని ఏమన్నారంటే..
పవన్‌ ఆయన గురించి ఆయనే చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందన్నారు. పురాణాల్లో పవన్‌ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉందంటూ సెటైర్స్ వేశారు. పవన్‌ కల్యాణ్ వామనుడు కాదు శల్యుడు, శిఖండిలాంటివాడు. పార్టీని, పార్టీ నేతల్ని అందరినీ శల్యుడిలా పవన్‌ మొత్తం నిర్వీర్యం చేస్తున్నారని నాని మండిపడ్డారు. తనను నమ్ముకున్న వాళ్లను పవన్ నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు