Telangana Elections 2023: ఇంతింతై వటుడింతై అన్నట్లుగా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన బర్రెలక్క అలియాస్ శిరీష(Shirisha) కూడా తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనంగా మారుతోంది. చిన్న గడ్డి పరకగా భావించిన రాజకీయ ఉద్ధండులకు ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. ఇందుక కారణం.. క్రమంగా ఆమెకు పెరుగుతున్న జనాధరననే. బర్రెలక్క అలియాస్ శిరీష.. కొల్లాపూర్ పాలిటిక్స్‌ని షేక్ చేస్తోంది. కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్కకు.. తెలంగాణ నుంచే కాదు, ఏపీ నుంచి కూడా మద్ధతు భారీగా వస్తోంది. రోజు రోజుకకు బర్రెలక్కకు సపోర్ట్ పెరుగుతుండటంతో.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు దడ పుడుతోంది. ఇక బర్రెలక్క ప్రచారంలో నిరుద్యోగులు సైతం భారీగా పాల్గొంటున్నారు. ఆమె ఎన్నికల ప్రచారం కోసం భారీగా విరాళాలు అందిస్తున్నారు. ప్రముఖులు సైతం బర్రెలక్కకు ఆర్థిక, నైతిక మద్ధతు తెలుపుతున్నారు.
ఈ క్రమంలోనే.. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవ్య కూడా బర్రెలక్కకు సపోర్ట్ ఇచ్చారు. జానకిపురం సర్పంచ్ నవ్య.. ఎమ్మెల్యే రాజయ్యపై వేధింపుల ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఆమె ఇప్పుడు కొల్లాపూర్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న శిరీషకు మద్ధతు ప్రకటించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో శిరీష గెలుపునకు కృషి చేస్తానని అన్నారు. ఈమేరకు నవ్య స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కొల్లాపూర్ బయలుదేరారు. శిరీష తరఫున తాను కూడా ప్రచారం చేస్తానని ప్రకటించారు నవ్య. నిరుద్యోగుల తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శిరీష యువత మొత్తం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. యువత మాత్రమే కాదు.. అభివృద్ధి కాముకులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజలంతా ఆమెకు సపోర్ట్ చేయాలన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమైన శిరీషను అభినందించారు.
Also read:
స్టూడెంట్‌కి తాళి కట్టిన టీచర్.. పైళ్లి అయిందంటూ రేప్.. కట్ చేస్తే..
ప్రతి గురువారం విష్ణువును ఇలా పూజించండి.. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయ్..!