Janagama: గొప్ప కార్యానికి వేదికైన పాలకుర్తి సోమనాథుడి స్వస్థలం వల్మిడి గ్రామంలో ఘనంగా సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు జరిగాయి. జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం చారిత్రక వల్మిడి గ్రామంలోని గుట్టపైన శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి పాల్గొన్నారు. By Vijaya Nimma 04 Sep 2023 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి Janagama: జనగామ జిల్లా పాలకుర్తి మడలం వల్మిడి గ్రామంలోని గుట్టపైన శ్రీసీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జనగామ జిల్లాలో పునః నిర్మించిన శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో వేదమంత్రోచ్ఛరణల నడుమ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి సీతారాముల విగ్రహ ప్రతిష్ట చేశాడు. గుడి నిర్మాణానికి కృషి చేసిన మంత్రిని జీయర్ స్వామి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దగ్గరుండి పర్యవేక్షించారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో హోమగుండ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నాలుగు రోజులుగా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆలయ పునరుద్దరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు ఖర్చు చేసింది. Your browser does not support the video tag. ఆదర్శపురుషుడు అనగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీరాముడే. ఆ రాముడికి ఉన్నన్ని గుడులు మరే దేవుడికి ఉండేవేమో..! రామాయణం రచించిన వాల్మీకి మహర్షికి జన్మనిచ్చిన ఊరు పాలకుర్తి.ఆ గడ్డే మహాకవి పోతనామాత్యుడి జన్మస్థలం. ఇప్పుడు పాలకుర్తి సోమనాథుడి స్వస్థలం గొప్ప కార్యానికి వేదికైంది. భద్రాచలం, అయోధ్య అనగానే ముందుగా రాముడూ గుర్తుకు వస్తారు. ఇప్పుడు అంతే చరిత్ర కలిగిన ఊరు వల్మిడి. చినజీయర్ స్వామి చేతుల మీదుగా భద్రాద్రిని మించి నిర్మించిన ఈ గుడిలో శ్రీసీతారామ లక్ష్మణ సమేత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. సీఎం కేసీఆర్ సహకారం, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంకల్పబలంతో పుణ్యక్షేత్రంగా వల్మీడి గ్రామం వెలుగులోకి వచ్చింది. వాల్మీకి మహర్షి రామాయణం రచించిన గుట్టపై విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. Also Read: దేశ్ కీ నేత కేసీఆర్ నినాదాలతో దద్దరిల్లిన పెళ్లి ప్రాంగణం Your browser does not support the video tag. సోమవారం ( నేడు) ఉదయం త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. సంప్రదాయబద్ధంగా మంత్రి ఎర్రబెల్లి చిన్న జీయర్ స్వామిని హోమ గుండానికి ఆహ్వానించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, ఆలయ ధర్మకర్తల మండలి, దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, నరసింహారెడ్డి, పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి, కార్య నిర్వహణ అధికారిని లక్ష్మీప్రసన్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. Your browser does not support the video tag. Also Read: తెలంగాణలో మరో ఐదురోజులు వానలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ #errabelli-dayakar-rao #anagama #sree-sitaramachandraswamy #valmidi-village #sri-sri-tridandi-chinnajeer-swamy #ministers-harish-rao #palakurti-hometown #somanatha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి