విశాఖ షిప్పింగ్ హార్బర్ బాధితులకు అండగా జనసేనాని.! విశాఖ షిప్పింగ్ హార్బర్ ఘటన బాధితులకు జనసేనాని పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. బోట్లు దగ్ధమై నష్టపోయిన వారికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. జనసేన తరుఫున బాధిత కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందజేయనున్నారు. By Jyoshna Sappogula 21 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Pawan Kalyan: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 40 ఫిషింగ్ బోట్లు కాలి బూడిదయ్యాయి. ఖరీదైన బోట్లు కాలిపోవడంతో మత్స్యకారులకు కోట్లలో నష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్‌లో నిలిపి ఉంచిన బోటులో మంటలు చెలరేగాయి. వాటిని అదుపు చేసేందుకు మత్స్యకారులు ప్రయత్నిస్తుండగానే క్షణాల్లోనే ఇతర బోట్లకు వ్యాపించాయి. బోట్లలో నిల్వ చేసిన డీజిల్, మత్స్యకారులు వంట కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్లు పెద్ద శబ్దాలతో పేలిపోయాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నష్టపోయిన వారికి ప్రభుత్వం 80 శాతం నష్ట పరిహరం చెల్లిస్తోంది. Also Read: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో మరో కొత్త కోణం.. నాని ఏం చెప్పాడంటే కాగా, విశాఖ షిప్పింగ్ హార్బర్ ఘటన బాధితులకు అండగా నిలిచారు జనసేనాని పవన్ కళ్యాణ్. బోట్లు దగ్ధమై నష్టపోయిన వారికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. జనసేన తరుఫున బాధిత కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందజేయనున్నారు. రెండు మూడు రోజుల్లో తానే స్వయంగా వచ్చి ఇస్తానని జనసేన అధినేత పవన్ తన సోషల్ మీడియాలో ప్రకటించారు. విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన 60కి పైగా బో ట్ల దగ్ధం జరిగి నష్టపోయిన బోట్ లు యజమానులకు వారి కుటుంబాలకు JSP తరుపున నుండి ఏభై వేల రూపాయలు ఆర్దిక సాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. వచ్చే రెండు మూడు రోజుల్లో నేనే స్వయం గా వచ్చి ఇస్తాను. వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుంది — Pawan Kalyan (@PawanKalyan) November 21, 2023 అయితే, విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెట్టింగ్ నేపథ్యంలో ఇక్కడ ఘర్షణ జరిగిందనే విచారణ చెపట్టిన పోలీసులు ఇందుకు పాల్పడ్డ యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాత్రి లంగర్ వేసిన బోటులో మద్యం పార్టీ జరిగిందని, ఇందులో ప్రముఖ యూట్యూబర్ నాని పాత్రకూడా ఉందని భావించిన అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. #pawan-kalyan #janasena #visakha-shipping-harbour-issue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి