Vishakapatnam: భారతీయ రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది. విశాఖపట్నం-రాయ్‌పూర్, విశాఖపట్నం-కోరాపుట్ తదితర ప్రాంతాల మీదుగా వెళ్లే పలు రైళ్లను (Trains) రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలచేసింది.
ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వేస్‌లోని వాల్టెయిర్ డివిజన్ సింగపూర్ రోడ్ & రాయగడ స్టేషన్‌ల మధ్య 3వ లైన్ ప్రీ/ఇంటర్‌లాకింగ్, ట్రాక్ రి కన్ స్ట్రక్షన్ పనులు జరుపుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో జనవరి 19-27 వరకు ప్రయాణికులు ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచిస్తూ షెడ్యూల్ మార్పులకు సంబంధించిన లిస్ట్ విడుదల చేసింది.
ప్రత్యేక ప్యాసింజర్ రద్దు..
జనవరి 19 నుంచి 27 వరకు విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్రత్యేక ప్యాసింజర్ రద్దు చేశారు. అలాగే రాయ్‌పూర్-విశాఖపట్నం రావాల్సిన ప్రత్యేక ప్యాసింజర్ జనవరి 28న రాయ్‌పూర్‌లో బయలుదేరుతుందని తెలిపారు. విశాఖపట్నం-భవానీపట్న ప్రత్యేక ప్యాసింజర్ రద్దు చేయబడింది. భవానీపట్న-విశాఖపట్నం ప్రత్యేక ప్యాసింజర్ రద్దు చేయగా ఇది 28న భవానీపట్న నుంచి బయలుదేరుతుంది.
ఇది కూడా చదవండి : బచ్చన్ ఇంట్లో గొడవలు.. ఐశ్వర్య-అభిషేక్ విడాకులు ఫిక్స్?
విశాఖపట్నం బైవీక్లీ ఎక్స్‌ప్రెస్..
అలాగే విశాఖపట్నం-కోరాపుట్ ప్రత్యేక ప్యాసింజర్ క్యాన్సిల్ చేయగా..ఇది విశాఖపట్నం నుంచి 27న బయలుదేరుతుంది. కోరాపుట్-విశాఖపట్నం ప్రత్యేక ప్యాసింజర్ కోరాపుట్ నుంచి 28 బయలుదేరుతుంది. విశాఖపట్నం-కోరాపుట్ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ 26న విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. కోరాపుట్-విశాఖపట్నం బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ జనవరి 27న కోరాపుట్ నుంచి బయలుదేరుతుంది. తిరుపతి-బిలాస్‌పూర్ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ తిరుపతినుంచి 25న స్టార్ట్ అవుతుంది. బిలాస్‌పూర్-తిరుపతి బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ 27 బిలాస్‌పూర్‌లో బయలుదేరుతుంది.
రాయగడ-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్..
సంబల్‌పూర్-రాయగడ ఎక్స్‌ప్రెస్ 27 సంబల్‌పూర్‌లో బయలుదేరి మునిగూడకు చేరకుంటుంది. రాయగడ-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు రాయగడకు బదులుగా 27న మునిగూడ నుండి సంబల్‌పూర్ కు బయలుదేరుతుంది. గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ 26న గుంటూరు నుంచి బయలుదేరి.. విజయనగరం వద్ద షార్ట్-టర్మినేట్ చేయబడుతుంది. ఇక రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ 27న రాయగడకు బదులుగా విజయనగరం నుంచి గుంటూరుకు ప్రయాణిస్తుంది.
ఇది కూడా చదవండి : Raja Singh: ‘నిన్ను లేపేస్తాం’..ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపులు
దారి మళ్లింపు..
రూర్కెలా-జగ్దల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రూర్కెలా నుంచి26న బయలుదేరి.. తేరుబలి - కెయుట్‌గూడ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. సింగపూర్ రోడ్, రాయగడ వద్ద స్టాప్‌ను తొలగించారు. జగదల్‌పూర్-రూర్కెలా ఎక్స్‌ప్రెస్ 27న జగదల్‌పూర్‌లో బయలుదేరి, కేయుట్‌గూడ-తేరుబలి మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. రాయగడ మరియు సింగపూర్ రోడ్‌లో స్టాప్‌ను తొలగించారు. హౌరా-జగ్దల్‌పూర్ సాంబలేశ్వరి ఎక్స్‌ప్రెస్, 26న హౌరా నుంచి బయలుదేరి, తేరుబలి - కెయుట్‌గూడ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. రాయగడ మరియు సింగపూర్ రోడ్‌లో స్టాప్‌ను తొలగించారు.
అహ్మదాబాద్-పూరి SF ఎక్స్‌ప్రెస్..
జగదల్‌పూర్-హౌరా సాంబలేశ్వరి ఎక్స్‌ప్రెస్ 27న జగదల్‌పూర్‌లో బయలుదేరి.. కీట్‌గూడ-తేరుబలి మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. రాయగడ, సింగపూర్ రోడ్‌లో స్టాప్‌ను తొలగించారు. పూరీ-అహ్మదాబాద్ SF ఎక్స్‌ప్రెస్ 26న పూరి నుంచి బయలుదేరుతుంది. ఇది మళ్లించిన మార్గంలో Khurhda-Kiterhlagda-Kiterhanga-Rad గుండా నడుస్తుంది. అహ్మదాబాద్-పూరి SF ఎక్స్‌ప్రెస్ 25న అహ్మదాబాద్‌లో బయలుదేరి, టిట్లాగఢ్-కెరెజంగా-ఖుర్దా రోడ్డు మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
లోకమాన్యతిలక్..
విశాఖపట్నం-లోకమాన్యతిలక్ టెర్మినస్-SF ఎక్స్‌ప్రెస్.. విశాఖపట్నం నుంచి 21న బయలుదేరుతుంది. 08:20 గంటలకు వెళ్లాల్సిన ట్రైన్ బదులుగా 13:20 గంటలకు బయలుదేరుతుంది. 5 గంటలు రీషెడ్యూల్ చేయబడుతుంది. నాందేడ్-సంబల్‌పూర్ SF ఎక్స్‌ప్రెస్ 27న నాందేడ్‌లో 20:30 గంటలకు బయలుదేరడానికి బదులుగా 4 గంటలకు షెడ్యూల్ చేయబడుతుంది. విశాఖపట్నం–భగత్ కి కోఠి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం నుంచి 25న 05:20 గంటలకు బయలుదేరడానికి బదులుగా 13:20 గంటలకు బయలుదేరుతుంది. 8 గంటలు రీషెడ్యూల్ చేయబడుతుంది.