Anantnag: అదీ ఇండియన్ ఆర్మీ పవర్! గుహలో నక్కిన ఉగ్రవాదులను ఎలా లేపేశారో చూడండి..!

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తోంది ఇండియన్ ఆర్మీ. ఉగ్రమూకల స్థావరాలను గుర్తించి, ధ్వంసం చేస్తున్నాయి భద్రతా దళాలు. తాజాగా భారత సైన్యం డ్రోన్‌ల సహాయంతో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ చేపట్టింది.

New Update
Anantnag: అదీ ఇండియన్ ఆర్మీ పవర్! గుహలో నక్కిన ఉగ్రవాదులను ఎలా లేపేశారో చూడండి..!

Anantnag India Army Attack: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తోంది ఇండియన్ ఆర్మీ(Indian Army). ఉగ్రమూకల స్థావరాలను గుర్తించి, ధ్వంసం చేస్తున్నాయి భద్రతా దళాలు. తాజాగా భారత సైన్యం డ్రోన్‌ల(Drone) సహాయంతో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ చేపట్టింది. కోకెర్‌నాగ్‌లో జరుగుతున్న ఈ ఆపరేషన్‌లో అటవీ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులను గుర్తించారు ఆర్మీ సిబ్బంది. డ్రోన్ సాయంతో ఆ ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. అనంత్‌నాగ్ జిల్లా కోకెర్‌నాగ్‌ ప్రాంతంలోని గాడోల్ అడవుల్లోని పర్వతాల్లో గల గుహలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు డ్రోన్ ఫుటేజీ ద్వారా గుర్తించారు ఇండియన్ ఆర్మీ అధికారులు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఉగ్రవాదుల స్థావరంపై సైన్యం బాంబు దాడి చేసింది. ఈ ఘటన అంతా డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. పేలుడు అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఉగ్రవాదులు పారిపోవడాన్ని గమనించిన డ్రోన్ సిబ్బంది.. అక్కడ కాపుకాస్తున్న సైనికులను అలర్ట్ చేశారు. దాంతో వారు ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు? వంటి వివరాలు అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.

ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన దాడి వీడియోను కింద చూడొచ్చు..

ఉగ్రవాదుల కోసం డేగ కళ్లతో ఎదురు చూస్తున్న ఇండియన్ ఆర్మీ సిబ్బంది..

publive-image

ఉగ్రవాదులు అటాక్ చేసిన ప్రాంతం ఇదే..

publive-image

ఉగ్రవాదుల వేట కోసం సిద్ధంగా ఉన్న భద్రతా దళాల వాహనాలు..

publive-image

ఉగ్రవాదులు రహస్యంగా నక్కిన కొండ గుహ ఇదే..

publive-image

తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను ఏరివేస్తున్న ఇండియన్‌ ఆర్మీ దళాలు..

publive-image

ఇండియన్ ఆర్మీ దాడులకు సంబంధించిన డ్రోన్ వీడియోస్ మీకోసం..

Also Read:

Breaking: RTV, NTV జర్నలిస్టులపై ఎమ్మెల్సీ చల్లా గూండాల దాడి

KCR: ఆంధ్రా పాలకులపై కేసీఆర్‌ ఫైర్.. మీ నీళ్లు మాకొద్దు..!

Advertisment
తాజా కథనాలు