Jailer : "జైలర్" ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్ ఏం అంటున్నారంటే...!!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ అయ్యింది. ఓవర్సీస్ తమిళనాడులో ప్రత్యేక షోలు షూరూ అయ్యాయి. నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ పాటలు, ట్రైలర్ ఈ మూవీకి భారీ క్రేజ్ ఇచ్చాయి. తమన్నా గ్లామర్, రజనీకాంత్ వింటేజ్ లుక్ వైరల్ అయ్యింది. దీంతో ఈ మూవీలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇలాంటి అంచాల మధ్య జైలర్ మూవీ ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే...

New Update
Jailer : "జైలర్" ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్ ఏం అంటున్నారంటే...!!

Jailer Twitter Review: ఈ మూవీ పూర్తిస్థాయి ఎంటర్టైన్ మెంట్ చిత్రం. ఫస్ట్ ఆఫ్ లో యోగిబాబు, తలైవర్ కాంబో సూపర్. ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ లో తలైవర్ ఓ రేంజ్ లో ఇరగదీవాడు. ఇక సెకండాఫ్ కు వచ్చే సరికి కొందరు స్పెషల్ ఎంట్రీలివ్వడంతో మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. క్లైమాక్స్ లో మేజర్ ట్విస్ట్ ఉంటుంది. జైలర్ మిమ్మల్ని నిరాశపరచదు..ఆనందపరుస్తుందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

రజనీకాంత్ అంటే సూపర్ స్టార్...సూపర్ స్టార్ అంటే రజనీకాంత్..మళ్లీతన సింహాసనం పదిలపర్చుకున్నాడు. జైలర్ దుమ్మురేపేలా ఉంది. సీన్స్ గూస్ బంప్స్ తెస్తాయి..నెల్సన్ మంచి సినిమా ఇచ్చినందుకు సంతోషంగా ఉందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

జైలర్ ప్రతిఒక్కరికీ నచ్చుతుంది...రాబోయేదంతా జైలర్ వీక్. బాక్సాఫీస్ సునామీ ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఆలస్యం చేయకుండా టికెట్స్ బుక్ చేసుకోండి అంటూ ఇంకోనెటిజన్ కామెంట్స్ చేశాడు.

ఇక జైలర్ మూవీలో రజనీకాంత్ (Superstar Rajinikanth) పేరు స్క్రీన్ పై రాగానే అభిమానుల కేరింతలు, అరుపులు మాటల్లో చెప్పలేం. రజనీ మానియాను చూపించేశారు. ఇది కేవలం బెంగళూరులో మాత్రమే కాదు..ప్రపంచమంతా జైలర్ థియేటర్లలో ఇలాంటి పరిస్థితే ఉంది.

Jailer Twitter Review:

https://twitter.com/OnlineRajiniFC/status/1689442558915846145?s=20

Also Read: భోళాశంకర్‌ టికెట్ల రేట్ల పెంపుపై ఉత్కంఠ.. ఆగ్రహంగా చిరు ఫ్యాన్స్

Advertisment
తాజా కథనాలు