Jailer: రజినీనా మజాకా.. రికార్డుల తలైవా..కెవ్వు కేక! విడుదలైన తొమ్మిది రోజులకే రజినీకాంత్ ‘జైలర్’ సినిమా రూ.500 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. కేవలం 6 రోజుల్లో, ఈ చిత్రం తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో బ్రేక్‌ఈవెన్ సాధించింది. వరుసగా ఫ్లాపులు చూసిన సన్ పిక్చర్స్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు.. 500 కోట్ల క్లబ్ లో సన్ పిక్చర్స్ నుంచి చేరిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. By Trinath 20 Aug 2023 in సినిమా New Update షేర్ చేయండి సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా మరో రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ చిత్రం వసూళ్లపరంగా 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఘనత సాధించిన 7వ సౌతిండియా మూవీగా జైలర్ అవతరించింది. ఇంతకీ ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలేంటో చూద్దాం.. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా మరో రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ చిత్రం వసూళ్లపరంగా 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఘనత సాధించిన 7వ సౌతిండియా మూవీగా జైలర్ అవతరించింది. ఇంతకీ ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలేంటో చూద్దాం. కోలీవుడ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది జైలర్. ఇన్నాళ్లూ విజయ్ పేరిట రాసి ఉన్న రికార్డుల్ని తిరగరాస్తోంది. ఈ క్రమంలో తమిళనాట బాహుబలి-2 రికార్డుల్ని కూడా జైలర్ సినిమా సమం చేస్తోంది. కేవలం 6 రోజుల్లో, ఈ చిత్రం తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో బ్రేక్‌ఈవెన్ సాధించింది. వారం రోజుల రన్ కూడా ముగియకుండానే ప్రతి సెంటర్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన చిత్రంగా అవతరించింది జైలర్. ఈ సినిమాతో బయ్యర్లంతా ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లారు. వరుసగా ఫ్లాపులు చూసిన సన్ పిక్చర్స్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు.. 500 కోట్ల క్లబ్ లో సన్ పిక్చర్స్ నుంచి చేరిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. జైలర్ ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా అవతరించి, తమిళ చిత్రసీమలో కొత్త బెంచ్‌మార్క్‌ని నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. 500 కోట్ల క్లబ్ లో చేరిన సౌతిండియా సినిమాలు ప్రస్తుతానికి 7 మాత్రమే. వీటిలో అగ్రస్థానంలో బాహుబలి, బాహుబలి-2 సినిమాలున్నాయి. వీటితో పాటు రజనీ నటించిన 2.O, జైలర్ సినిమాలు లిస్ట్ లో చేరాయి. ఇక రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా 500 కోట్ల క్లబ్ లో చేరింది. వీటితో పాటు పొన్నియన్ సెల్వన్, కేజీఎఫ్ చిత్రాలు ఈ క్లబ్ లో కొనసాగుతున్నాయి. ఇలా ప్రస్తుతానికి ఈ క్లబ్ లో సౌత్ నుంచి 7 సినిమాలు కొనసాగుతుండగా.. వీటిలో రజనీకాంత్ సినిమాలు 2 ఉండడం విశేషం. అదే విధంగా రాజమౌళి డైరక్ట్ చేసిన సినిమాలు 3 ఉండడం విశేషం. సరిగ్గా ఇక్కడే కొత్త చర్చ మొదలైంది. రాజమౌళి, రజనీకాంత్ కలిస్తే.. సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని అంటున్నారు కోలీవుడ్ రజనీకాంత్ ఫ్యాన్స్.పోతోంది జైలర్. ఇన్నాళ్లూ విజయ్ పేరిట రాసి ఉన్న రికార్డుల్ని తిరగరాస్తోంది. ఈ క్రమంలో తమిళనాట బాహుబలి-2 రికార్డుల్ని కూడా జైలర్ సినిమా సమం చేస్తోంది. కేవలం 6 రోజుల్లో, ఈ చిత్రం తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో బ్రేక్‌ఈవెన్ సాధించింది. వారం రోజుల రన్ కూడా ముగియకుండానే ప్రతి సెంటర్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన చిత్రంగా అవతరించింది జైలర్. ఈ సినిమాతో బయ్యర్లంతా ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లారు. వరుసగా ఫ్లాపులు చూసిన సన్ పిక్చర్స్ కు ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు.. 500 కోట్ల క్లబ్ లో సన్ పిక్చర్స్ నుంచి చేరిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. జైలర్ ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా అవతరించి, తమిళ చిత్రసీమలో కొత్త బెంచ్‌మార్క్‌ని నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. 500 కోట్ల క్లబ్ లో చేరిన సౌతిండియా సినిమాలు ప్రస్తుతానికి 7 మాత్రమే. వీటిలో అగ్రస్థానంలో బాహుబలి, బాహుబలి-2 సినిమాలున్నాయి. వీటితో పాటు రజనీ నటించిన 2.O, జైలర్ సినిమాలు లిస్ట్ లో చేరాయి. ఇక రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా 500 కోట్ల క్లబ్ లో చేరింది. వీటితో పాటు పొన్నియన్ సెల్వన్, కేజీఎఫ్ చిత్రాలు ఈ క్లబ్ లో కొనసాగుతున్నాయి. ఇలా ప్రస్తుతానికి ఈ క్లబ్ లో సౌత్ నుంచి 7 సినిమాలు కొనసాగుతుండగా.. వీటిలో రజనీకాంత్ సినిమాలు 2 ఉండడం విశేషం. అదే విధంగా రాజమౌళి డైరక్ట్ చేసిన సినిమాలు 3 ఉండడం విశేషం. సరిగ్గా ఇక్కడే కొత్త చర్చ మొదలైంది. రాజమౌళి, రజనీకాంత్ కలిస్తే.. సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని అంటున్నారు కోలీవుడ్ రజనీకాంత్ ఫ్యాన్స్. #rajini-kanth #rajinikanth #jailer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి