Jailer: రజినీనా మజాకా.. రికార్డుల తలైవా..కెవ్వు కేక!

విడుదలైన తొమ్మిది రోజులకే రజినీకాంత్‌ ‘జైలర్’ సినిమా రూ.500 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. కేవలం 6 రోజుల్లో, ఈ చిత్రం తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో బ్రేక్‌ఈవెన్ సాధించింది. వరుసగా ఫ్లాపులు చూసిన సన్ పిక్చర్స్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు.. 500 కోట్ల క్లబ్ లో సన్ పిక్చర్స్ నుంచి చేరిన తొలి సినిమా ఇదే కావడం విశేషం.

New Update
Jailer: రజినీనా మజాకా.. రికార్డుల తలైవా..కెవ్వు కేక!

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా మరో రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ చిత్రం వసూళ్లపరంగా 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఘనత సాధించిన 7వ సౌతిండియా మూవీగా జైలర్ అవతరించింది. ఇంతకీ ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలేంటో చూద్దాం..

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా మరో రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ చిత్రం వసూళ్లపరంగా 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఘనత సాధించిన 7వ సౌతిండియా మూవీగా జైలర్ అవతరించింది. ఇంతకీ ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలేంటో చూద్దాం. కోలీవుడ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది జైలర్. ఇన్నాళ్లూ విజయ్ పేరిట రాసి ఉన్న రికార్డుల్ని తిరగరాస్తోంది. ఈ క్రమంలో తమిళనాట బాహుబలి-2 రికార్డుల్ని కూడా జైలర్ సినిమా సమం చేస్తోంది.

కేవలం 6 రోజుల్లో, ఈ చిత్రం తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో బ్రేక్‌ఈవెన్ సాధించింది. వారం రోజుల రన్ కూడా ముగియకుండానే ప్రతి సెంటర్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన చిత్రంగా అవతరించింది జైలర్. ఈ సినిమాతో బయ్యర్లంతా ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లారు.

వరుసగా ఫ్లాపులు చూసిన సన్ పిక్చర్స్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు.. 500 కోట్ల క్లబ్ లో సన్ పిక్చర్స్ నుంచి చేరిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. జైలర్ ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా అవతరించి, తమిళ చిత్రసీమలో కొత్త బెంచ్‌మార్క్‌ని నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. 500 కోట్ల క్లబ్ లో చేరిన సౌతిండియా సినిమాలు ప్రస్తుతానికి 7 మాత్రమే. వీటిలో అగ్రస్థానంలో బాహుబలి, బాహుబలి-2 సినిమాలున్నాయి. వీటితో పాటు రజనీ నటించిన 2.O, జైలర్ సినిమాలు లిస్ట్ లో చేరాయి. ఇక రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా 500 కోట్ల క్లబ్ లో చేరింది. వీటితో పాటు పొన్నియన్ సెల్వన్, కేజీఎఫ్ చిత్రాలు ఈ క్లబ్ లో కొనసాగుతున్నాయి.

ఇలా ప్రస్తుతానికి ఈ క్లబ్ లో సౌత్ నుంచి 7 సినిమాలు కొనసాగుతుండగా.. వీటిలో రజనీకాంత్ సినిమాలు 2 ఉండడం విశేషం. అదే విధంగా రాజమౌళి డైరక్ట్ చేసిన సినిమాలు 3 ఉండడం విశేషం. సరిగ్గా ఇక్కడే కొత్త చర్చ మొదలైంది. రాజమౌళి, రజనీకాంత్ కలిస్తే.. సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని అంటున్నారు కోలీవుడ్ రజనీకాంత్ ఫ్యాన్స్.పోతోంది జైలర్. ఇన్నాళ్లూ విజయ్ పేరిట రాసి ఉన్న రికార్డుల్ని తిరగరాస్తోంది. ఈ క్రమంలో తమిళనాట బాహుబలి-2 రికార్డుల్ని కూడా జైలర్ సినిమా సమం చేస్తోంది. కేవలం 6 రోజుల్లో, ఈ చిత్రం తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో బ్రేక్‌ఈవెన్ సాధించింది. వారం రోజుల రన్ కూడా ముగియకుండానే ప్రతి సెంటర్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన చిత్రంగా అవతరించింది జైలర్. ఈ సినిమాతో బయ్యర్లంతా ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లారు.

వరుసగా ఫ్లాపులు చూసిన సన్ పిక్చర్స్ కు ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు.. 500 కోట్ల క్లబ్ లో సన్ పిక్చర్స్ నుంచి చేరిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. జైలర్ ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా అవతరించి, తమిళ చిత్రసీమలో కొత్త బెంచ్‌మార్క్‌ని నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. 500 కోట్ల క్లబ్ లో చేరిన సౌతిండియా సినిమాలు ప్రస్తుతానికి 7 మాత్రమే. వీటిలో అగ్రస్థానంలో బాహుబలి, బాహుబలి-2 సినిమాలున్నాయి. వీటితో పాటు రజనీ నటించిన 2.O, జైలర్ సినిమాలు లిస్ట్ లో చేరాయి. ఇక రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా 500 కోట్ల క్లబ్ లో చేరింది. వీటితో పాటు పొన్నియన్ సెల్వన్, కేజీఎఫ్ చిత్రాలు ఈ క్లబ్ లో కొనసాగుతున్నాయి.

ఇలా ప్రస్తుతానికి ఈ క్లబ్ లో సౌత్ నుంచి 7 సినిమాలు కొనసాగుతుండగా.. వీటిలో రజనీకాంత్ సినిమాలు 2 ఉండడం విశేషం. అదే విధంగా రాజమౌళి డైరక్ట్ చేసిన సినిమాలు 3 ఉండడం విశేషం. సరిగ్గా ఇక్కడే కొత్త చర్చ మొదలైంది. రాజమౌళి, రజనీకాంత్ కలిస్తే.. సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని అంటున్నారు కోలీవుడ్ రజనీకాంత్ ఫ్యాన్స్.

Advertisment
తాజా కథనాలు