Actor Vinayakan : ఎయిర్ పోర్ట్ లో 'జైలర్' నటుడు వినాయకన్ అరెస్ట్.. ఏం జరిగిందంటే

మలయాళ నటుడు వినాయక అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఐఎస్ఎఫ్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. గ‌తేడాది మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై వినాయ‌క‌న్ దాడికి పాల్ప‌డ్డాడు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Actor Vinayakan : ఎయిర్ పోర్ట్ లో 'జైలర్' నటుడు వినాయకన్ అరెస్ట్.. ఏం జరిగిందంటే

Senior Actor Vinayakan : ప్రముఖ మలయాళ నటుడు వినాయక అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఐఎస్ఎఫ్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. గ‌తేడాది మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై వినాయ‌క‌న్ దాడికి పాల్ప‌డ్డాడు. బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు శ‌నివారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.

మొదట పోలీసులు ఆయనకు మర్యాదగా నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసినా వినకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం వినాయ‌క‌న్‌ను ఆర్జీఐ ఎయిర్‌పోర్టు పోలీసులు విచారిస్తున్నారు. కాగా తాను ఎలాంటి తప్పు చేయలేదని వినాయకన్ ఇప్ప‌టికే ప‌లుమార్లు చెప్పుకొచ్చాడు.

Also Read : రెండు సార్లు బ్రేకప్ అయింది.. తట్టుకోలేకపోయా.. తమన్నా ఎమోషనల్ కామెంట్స్

సీఐఎస్ఎఫ్ అధికారులు తనను విమానాశ్రయంలోని ఓ గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారని ఆరోపించారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని కోరాడు. మలయాళ సినీ పరిశ్రమలో ఎక్కువ సినిమాలు చేసిన వినాయకన్.. రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో విలన్ పాత్రతో సౌత్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు